Afghan Govt Media Head : ఆఫ్గాన్ గవర్నమెంట్ మీడియా హెడ్ దారుణ హత్య

ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.

Afghan Govt Media Head : ఆఫ్గాన్ గవర్నమెంట్ మీడియా హెడ్ దారుణ హత్య

Menapal

Updated On : August 6, 2021 / 4:42 PM IST

Afghan Govt Media Head ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వపు మీడియా ఇన్ఫర్మెషన్ సెంటర్ డైరక్టర్ దవా ఖాన్ మీనాపాల్ దారుణ హత్యకు గురయ్యారు.  శుక్రవారం మధ్యాహ్నాం రాజధాని కాబూల్ లోని దారుల్ అమన్ రోడ్ లో మీనాపాల్ ని తాలిబన్లు కాల్చి చంపేశారు. కాగా, తమపై ఎయిర్ స్ట్రైక్ లు తీవ్రతరం చేసినందును సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను టార్గెట్ చేస్తామంటూ తాలిబన్లు హెచ్చరించిన కొద్ది రోజుల వ్యవధిలో దవా ఖాన్ మీనాపాల్ శుక్రవారం కాబూల్ లో హత్యకు గురైనట్లు ఆఫ్గనిస్తాన్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ తెలిపింది

దురదృష్టవశాత్తు, క్రూరమైన ఉగ్రవాదులు మరోసారి పిరికి చర్యకు పాల్పడ్డారు మరియు దేశభక్తుడైన ఆఫ్ఘన్‌ను చంపారని ఇంటీరియర్ మంత్రిత్వశాఖ ప్రతినిధి మిర్వాయిస్ స్తానిక్జాయ్ తెలిపారు.

READ Afghanistan comedian murder : ఇంటి నుంచి లాక్కెళ్లి ప్రముఖ కమెడియన్‌ హత్య