Helicopter Crash : దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మృతి.. ఎలా గుర్తించారంటే?
Helicopter Crash : ఇండోనేసియాలోని పశ్చిమ కలిమంతన్ ప్రావిన్స్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.
Helicopter Crash
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్
- పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంలో ఘటన
- ఎనిమిది మంది మృతి
Helicopter Crash : ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మరణించారు. ఇండోనేసియాలోని పశ్చిమ కలిమంతన్ ప్రావిన్స్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Also Read : Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. కుప్పకూలిన ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ఎయిర్ బస్ హెచ్-130 గురువారం మెల్వాయ్లో టేకాఫ్ అయిన కొంత సమయానికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఓ కొండపై దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ సిగ్నల్ మిస్ అయింది. దీంతో హెలికాప్టర్ జాడ కనిపిపెట్టేందుకు రెస్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. టేకాఫ్ అయిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో రెస్క్యూ బృందం హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన సూపర్ ప్యూమా హెలికాప్టర్ ఈ శకలాలను గుర్తించింది.
ప్రమాద స్థలంలో మృతదేహాలను వెలికితీ ప్రక్రియను రెస్క్యూ బృందం చేపట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు హెలికాప్టర్ సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇండోనేషియా నేషనల్ పోలీస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే, హెలికాప్టర్ ప్రమాదం సమయంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని బుకిట్ పుంటాక్ ప్రాంత నివాసులు అధికారులకు తెలిపారు.
నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ డిప్యూటీ ఎడి ప్రాకోసో మాట్లాడుతూ.. వైమానిక నిఘా ద్వారా కచ్చితమైన కోఆర్డినేట్లను గుర్తించి గ్రౌండ్ టీమ్స్‌కు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వాతావరణం అనుకూలించకపోవటంతో అక్కడికి చేరుకోవటం సహాయ బృందాలకు సవాలుగా మారిందని చెప్పారు. ప్రమాదంకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఇండోనేసియాలోని పామాయిల్ కంపెనీదని, హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారాకు చెందిందని అధికారులు తెలిపారు.
