World warming: దడ పుట్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్.. మానవాళికి పెను ముప్పు పొంచి ఉందా?

19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.

World warming: దడ పుట్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్.. మానవాళికి పెను ముప్పు పొంచి ఉందా?

Updated On : June 13, 2023 / 5:56 PM IST

world warming – greenhouse gas emissions: సీజన్‌తో సంబంధం లేకుండా తుపాన్లు సంభవిస్తాయ్. ఎండాకాలం ముగిసినా.. హీట్ వేవ్స్ (Heat Waves) వెంటాడుతూనే ఉంటాయ్. శీతాకాలం (Winter)లో.. చలి తీవ్రత ఊహించని స్థాయికి పెరిగిపోతుంది. వర్షాకాలంలో కుండపోత వానలతో వరదలు (Floods) పోటెత్తుతాయ్. హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరిగి.. సముద్ర మట్టాలు పెరిగిపోతాయ్. అంతకుముందెన్నడూ చూడని జల ప్రళయం సంభవిస్తుంది. నానాటికీ భూతాపం పెరిగిపోయి.. భూగోళం(Earth) క్రమంగా అగ్నిగుండంగా మారిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మానవాళి చాలా డేంజర్‌లో ఉంది. శాస్త్రవేత్తలు రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్టులో బయటపడిన షాకింగ్ విషయాలు.. ఆందోళనకు గురిచేస్తున్నాయ్.

భవిష్యత్తులో భూమిపై.. విపత్తుల విలయం!
అవును.. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కంటిన్యూ అయితే.. భూతాపం పెరుగుతూ పోతే.. మరికొన్నేళ్లలోనే ఊహించని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. అదే గానీ జరిగితే.. వాటిని టాకిల్
చేసే టైమ్ కూడా మన దగ్గర ఉండదని చెబుతున్నారు. భూమిపై ఉన్న ప్రతి ప్రాంతంలో, మొత్తం వాతావరణ వ్యవస్థలో వస్తున్న మార్పులు.. రోజురోజుకు ఆందోళన పెంచుతున్నాయ్. ఇప్పటికే కొన్ని మార్పులు
సంభవించాయ్. వాటి ఎఫెక్ట్.. అప్పుడప్పుడూ మనకు తెలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులపై.. శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో తేలుతున్న అంశాలు కూడా టెన్షన్ పెడుతున్నాయ్. వాటిలో..
భూతాపం, సముద్ర మట్టాలు పెరగడం లాంటివి వణుకు పుట్టిస్తున్నాయ్.

గరిష్ఠ స్థాయికి గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు
శిలాజ ఇంధనాల వాడకం, కాలుష్యం, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల, ప్రకృతి విపత్తులు.. ఇలాంటి వాటి గురించి తరచుగా వింటూనే ఉంటాం. అయినా.. ప్రపంచ దేశాలు ఇప్పటికీ నష్ట నివారణ చర్యలు
పెద్దగా చేపట్టిన దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు.. గరిష్ఠ స్థాయికి చేరిపోయినట్లు తాజా నివేదికలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వెలువడుతున్న గ్రీన్‌హౌజ్‌
వాయువులు.. 54 బిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌తో సమానమని తేల్చారు శాస్త్రవేత్తలు. వరల్డ్ వైడ్ ఉన్న 50 మంది అగ్ర శ్రేణి సైంటిస్టులు.. భూ ఉష్ణోగ్రతలపైనా రీసెర్చ్ చేసి.. జాయింట్ రిపోర్ట్ రిలీజ్ చేశారు.
మానవ చర్యలు, గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాల వల్ల భూతాపం పెరుగుతోందన్నారు. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. మానవాళికి, జీవజాలానికి ఆవాసంగా ఉన్న భూగోళం..
క్రమంగా అగ్నిగుండంగా మారిపోతోందని హెచ్చరిస్తున్నారు.

Also Read: సముద్రగర్భంలో అమెరికా, చైనా దేశాల ఇంటర్నెట్ కేబుల్‌ వార్.. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయనుందా?

పరిస్థితి ఇలాగే కొనసాగితే..
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భూతాపం
మానవాళిని కబళించడం ఖాయమంటున్నారు. గతంతో పోలిస్తే.. గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయ్. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని యథాతథంగా కొనసాగిస్తే.. భూ ఉపరితల
ఉష్ణోగ్రత సమీప భవిష్యత్తులోనే 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఇదెంతో.. ప్రమాదకరమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. భారత్‌లో తరచుగా హీట్ వేవ్స్‌తో పాటు వరదలు సంభవిస్తున్నాయ్. సముద్రాల
వేడెక్కడం వల్ల.. వాటిలో నీటిమట్టాలు కూడా పెరుగుతాయ్. ఇవన్నీ.. తీవ్ర తుపానులకు దారితీసి.. వరదల రూపంలో దెబ్బతీస్తాయి. ప్రధానంగా.. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో తరచుగా వరదలు సంభవించే
అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.

Also Read: నీటి అడుగున 100 రోజులు.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరంటే?

భారత్ లాంటి దేశానికి ఏరోసోల్ ఉద్గారాల ద్వారా హీట్ వేవ్స్ పెరుగుతాయ్. దీని వల్ల.. గాలి నాణ్యత తగ్గుతుంది. వాతావరణ మార్పులతో హీట్ వేవ్స్, భారీ వర్షాలు, మంచు ఫలకాలు కరగడం లాంటివి కూడా
సంభవిస్తాయి. ఇవన్నీ.. మనపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి. దాదాపు 50 శాతం థర్మల్ విస్తరణ.. సముద్ర మట్టాలు పెరిగేందుకు కారణమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే.. అరేబియా సముద్రం,
బంగాళాఖాతంతో పోలిస్తే.. హిందూ మహాసముద్రం ప్రపంచ సగటు కంటే వేగంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరికొన్నేళ్లలోనే.. తీరప్రాంతాలు కోతకు గురయ్యే అవకాశముంది. తరచుగా తుపాన్లు
విరుచుకుపడటంతో పాటు మళ్లీ మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఉష్ణోగ్రతల స్థిరీకరణకు 30 సంవత్సరాలు
గతంలో వందేళ్లకోసారి పెరిగిన సముద్ర మట్టాలు.. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రతి ఏటా జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే.. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు.. కొన్ని నివారణ
చర్యలను కూడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్ హౌస్ వాయువులు.. క్లైమేట్ ఛేంజ్‌ను పరిమితం చేయగలవు. కానీ.. ఇందుకు కొన్ని దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు
ఒప్పుకున్నప్పటికీ.. తక్షణ చర్యలతో ప్రపంచ ఉష్ణోగ్రతలు స్థిరీకరించడానికి.. 20 నుంచి 30 సంవత్సరాలు పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

మరికొన్నేళ్లలో కనిపించబోయే విధ్వంసం ఏంటి? వివరాలకు ఈ వీడియో చూడండి..