America Honduras Prison: జైలులో దారుణం.. 46మంది మహిళా ఖైదీలు మృతి.. సెల్‌లో వేసి నిప్పంటించిన దుండగులు
దాడికి పాల్పడే ముందే దుండగులు ఖైదీలుఉన్న సెల్‌లకు తాళాలు వేశారని, ఆ తరువాత కాల్పులు జరిపారని హుండురాస్ జాతీయ పోలీసు దర్యాప్త సంస్థప్రతినిధి యూరి మోరా తెలిపారు.

Honduras prison
Honduras Prison: అమెరికాలోని హోండురాస్ జైలులో దారుణం జరిగింది. రాజధాని నగరం తెగుసిగల్పాకు వాయవ్యంగా 30 మైళ్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైలు ఉంది. ఈ జైలులో 46మంది మహిళా ఖైదీలు మరణించారు. బారియో 18 గ్యాంగ్ సభ్యులు జైలులో కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ తరువాత పారిపోతున్న ఖైదీలను సెల్‌లో బంధించి నిప్పంటించారు. దీంతో అనేక మంది సజీవదహనం అయ్యారు. 26మంది ఖైదీలను తుపాకులతో కాల్చి చంపగా, మిగిలిన వారిని సజీవదహనం చేశారు.
PM Modi meets Joe Biden: వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో మోదీ సమావేశం
దాడికి పాల్పడే ముందే దుండగులు ఖైదీలుఉన్న సెల్‌లకు తాళాలు వేశారని, ఆ తరువాత కాల్పులు జరిపారని హుండురాస్ జాతీయ పోలీసు దర్యాప్త సంస్థప్రతినిధి యూరి మోరా తెలిపారు. మిగిలిన వారు సెల్‌లో నుంచి తప్పించుకొని బయటకురాగా.. వారిని మరోసారి సెల్‌లోకి ఈడ్చుకెళ్లి నిప్పంటించారని, దీంతో మిగిలినవారు సజీవదహనం అయ్యారని చెప్పారు. గాయపడిన వారిని తెగుసిగల్పా ఆస్పత్రికి తరలించగా అందులో ఐదుగురు మహిళా ఖైదీలు చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 46కు చేరినట్లు చెప్పారు. అయితే మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
దారుణ ఘటన తరువాత ప్రభుత్వం విడుదల చేసిన వీడియో క్లిప్పుల్లో జైలులోపల అనేక పిస్టల్స్, కొడవళ్లు, ఇతర బ్లేడెడ్ ఆయుధాలు ఉన్నాయి. ఈ ఘటనలో జైలు గార్డులు ఎవరూ గాయపడలేదు. అయితే, ఈ ఘటనపై హుండురాన్ అధ్యక్షులు జియోమారా కాస్ట్రో స్పందించారు. మహిళా ఖైదీల మరణాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జైలులో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా విల్లాన్యువా తెలిపారు.
Crime News: గర్ల్ ఫ్రెండ్‌తో ఆటోలో వెళ్తూ అందులోనే ఆమెను చంపేసిన యువకుడు
ఈ ఘటన తరువాత జైలులో ఉన్న ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, జైలులో ఖైదీలు ఎవరెవరు మరణించారనే వివరాలను జైలు అధికారులు విడుదల చేయలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.