Hong Kong: హాంకాంగ్‌లో జలప్రళయం వచ్చిందా? వీడియోలు చూస్తే వణుకు పుట్టాల్సిందే..

హాంకాంగ్‌లో భారీ వర్షం కారణంగా శుక్రవారం రైల్వేశాఖ రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది.

Hong Kong: హాంకాంగ్‌లో జలప్రళయం వచ్చిందా? వీడియోలు చూస్తే వణుకు పుట్టాల్సిందే..

Hong kong

Updated On : September 8, 2023 / 2:08 PM IST

Hong Kong Heavy rain: ఆసియా ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్ భారీ వర్షంతో తడిసిపోయింది. హాంకాంగ్‌లో జలప్రళయం వచ్చిందా? అన్నట్లుగా వర్ష బీభత్సం సృష్టించింది. మహానగరంలో 140 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం చూడలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల సమయంలో 158.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1884 తరువాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనట. ఈ నగరంలో దాదాపు 75లక్షల మంది నివసిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 83 మంది ఆస్పత్రి పాలయ్యారని అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు.

Heavy rain in Hong Kong

Heavy rain in Hong Kong

Heavy Rains : తెలంగాణలో జోరుగా కురుస్తున్న వానలు

నగరంలో అతిపెద్ద వర్షపాత హెచ్చరిక అయిన బ్లాక్ ను గురువారం సాయంత్రమే జారీ చేశారు. భారీ వర్షం కారణంగా శుక్రవారం రైల్వేశాఖ రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఉదయం ట్రేడింగ్ ను నిలిపివేసింది. నగరాన్ని క్వోలూన్ ద్వీపకల్పంతో అనుసంధానించే మార్గంకూడా వరదల్లో చిక్కుకుంది.

Hong Kong

Hong Kong

Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. రాత్రంతా కురుస్తూనే ఉన్న వర్షం

ఇటీవలే అత్యంత బలమైన టైపూన్ బారినపడి కోలుకుంటున్న ఈ నగరంపై తాజా వరదలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. కొండలపై నుంచి నీరు ప్రవహించడంతో ఇరుకైన వీధుల్లో నడుము లోతు వరకు వరదనీరు ప్రవహించింది. మాల్స్, మెట్రో స్టేషన్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.