హాంగ్ కాంగ్ లో కరెన్సీ కన్నా టాయిలెట్ పేపర్ రోల్స్ కే వాల్యూ!

హాంగ్ కాంగ్ లో కరెన్సీ కన్నా టాయిలెట్ పేపర్ రోల్స్ కే వాల్యూ!

Updated On : February 17, 2020 / 6:30 AM IST

ఆయుధాలతో వచ్చి టిష్యూలు పట్టుకెళ్లడమంటే హాస్యాస్పదంగా అనిపించినా.. వాటికున్న డిమాండ్ అలాంటి పని చేయించిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. సోమవారం ఫిబ్రవరి 17న దాడి చేసి వందల్లో టాయిలెట్ పేపర్ రోల్స్‌ను దోచుకెళ్లారు. కరోనా వైరస్ నుంచి జాగ్రత్త పడేందుకు ముఖాలకు అడ్డుగా మాస్క్‌లు, టిష్యూలు పెట్టుకోవాలని వైద్యులు చెప్తున్నారు. 

టాయిలెట్ రోల్స్ డిమాండ్ బియ్యం, పాస్తాలతో పాటు సమానంగా పెరిగిపోయింది. దొంగతనం చేసినందుకు కాదు.. వాళ్లు తీసుకెళ్లిన టిష్యూలు ఇస్తే సరిపోతుందని మాల్ యజమానులు వాపోతున్నారు. వందల సంఖ్యలో దొంగిలించడంతో వచ్చిన జనాన్ని నిరుత్సాహంతో పంపించాల్సి వస్తుందని, ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తంలో రీ ప్లేస్ చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. 

ఓ ట్రక్ డ్రైవర్ బయట ఉండగా లోనికి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆయుధాలతో బెదిరించి టిష్యూలు పట్టుకుపోయారని పోలీసులు చెబుతున్నారు. మరో ఘటనలో హోం డెలీవరీ చేసేందుకు తీసుకెళ్తున్న వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి టిష్యూలను పట్టుకుపోయారు. సీసీటీవీల్లో ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. 

వీటికి భయమేసి కొన్ని ప్రదేశాల్లో అసలు ధర కంటే డెలీవరి ఛార్జిలే భారీగా పెంచేశారు. బర్త్ డే పార్టీలకు గిఫ్ట్‌లుగా ఫ్లవర్ బొకేలు, ఫొటోలు ఇవ్వడానికి బదులు మాస్క్‌లు, టిష్యూలు ఇచ్చి బహుకరిస్తున్నారు. అమెరికన్ జోయెల్ వార్నర్ అనే వ్యక్తి వైన్ కంటే ఇదే విలువైన బహుమతి అంటూ అంది అందుకుని మురిసిపోతున్నాడు. 

జనాల్లో భయం పుట్టించి ఫుడ్, క్లీనింగ్ చేసేందుకు వాడే లిక్విడ్స్‌కు డిమాండ్ పెంచుకుంటున్నారు. ప్రజలు భయానికి గురవద్దు. అంటూ సూపర్ మార్కెట్లు, ఫార్మసీల్లో పోస్టర్లు అంటిస్తోంది ప్రభుత్వం.