Plane Crash : ఓ మై గాడ్.. ఘోర ప్రమాదం, రోడ్డుపై కుప్పకూలిన విమానం, 10మంది దుర్మరణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు చూసి షాక్ అవుతున్నారు. Plane Crash - Malaysia

Plane Crash : ఓ మై గాడ్.. ఘోర ప్రమాదం, రోడ్డుపై కుప్పకూలిన విమానం, 10మంది దుర్మరణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Plane Crash - Malaysia (Photo : Google)

Plane Crash – Malaysia : మలేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 10మంది చనిపోయారు. కౌలాలంపూర్ సమీపంలో ఎక్స్ ప్రెస్ వేపై చార్టర్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మందితో పాటు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

లంగ్ కావి ఎయిర్ పోర్ట్ నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్ పోర్టుకి వెళ్తున్న విమానంలో సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read..Beer : షాకింగ్.. కింగ్ ఫిషర్ బీర్‌లో నిషేధిత రసాయనం, తాగితే ప్రాణాలకే ప్రమాదం, వెంటనే అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశం

ఫోర్ లేన్ రోడ్డుపై చిన్నపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాద దృశ్యాలు హైవైపే వెళ్తున్న కారు డాష్ కామ్ లో రికార్డ్ అయ్యాయి. చనిపోయిన వారిలో 8మంది విమానంలోని వారే. మరో ఇద్దరు వాహనదారులు. రోడ్డుపై బైక్స్ పై వెళ్తున్న వ్యక్తి, కారులో వెళ్తున్న మరో వ్యక్తి ప్రమాదంలో చనిపోయారు. విమానం నేలపై పడగానే పెద్ద శబ్బంతో పేలిపోయింది. భారీగా మంట ఎగిసిపడింది. దట్టమైన పొగ వ్యాపించింది. చనిపోయిన వారిలో స్టేట్ అసెంబ్లీ మ్యాన్ జొహారీ ఉన్నట్లు గుర్తించారు.

Also Read..Pakistan Zindabad : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు, పిచ్చకొట్టుడు కొట్టిన జనాలు.. సినిమా థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం, వైరల్ వీడియో

ఈ విమానం నార్తర్న్ రిసార్ట్ ఐల్యాండ్ లంగ్ కావి నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా ఎయిర్ పోర్టుకి వెళ్తోంది. ఇంతలోనే ప్రమాదం జరిగిపోయింది. విమానంలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మరో ఇద్దరు క్రూ సిబ్బంది. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. విమానం ఎందుకు కూలింది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా నేలపై కుప్పకూలడం, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.