Viral Hourse: మ్యూజిక్ విని డాన్స్ చేస్తున్న గుర్రం

సంగీతానికి గోవులే కాదు గుర్రాలు కూడా డాన్స్ చేస్తాయి. ఇదిగో ఈ గుర్రాన్ని చూడండీ..మ్యూజిక్ విని ఎలా తల ఊపుతోందో..

Viral Hourse: మ్యూజిక్ విని డాన్స్ చేస్తున్న గుర్రం

Hourse Dance

Updated On : September 13, 2021 / 2:28 PM IST

Viral Hourse : శ్రీకృష్ణుడు వేణుగానానికి గోవులు కూడా నృత్యం చేసేవట. అది కిట్టయ్య సమ్మోహనమో..లేదా సంగీతానాకి ఉన్న గొప్పదనమో అనేది పక్కన పెడితే..సంగీతానికి గోవులే కాదు గుర్రాలు కూడా డాన్స్ చేస్తాయని మీకు తెలుసా? డాన్స్ చేసే గుర్రాలను సినిమాల్లో చూసి ఉంటాం. ఇదిగో ఇక్కడ ఉన్న ఓ గుర్రం మాత్రం మ్యూజిక్ విని భలే డాన్స్ చేస్తోంది.ఓ అమ్మాయి మ్యూజిక్ వింటోంది. చిటికెలు వేస్తూ..మ్యూజిక్ కు అనుగుణంగా కదులుతోంది. ఆ అమ్మాయి పక్కనే ఉన్న కొన్ని గుర్రాల్లో ఒక గుర్రం ఆ మ్యూజిక్ కు అనుగుణంగా చక్కగా తల ఊపుతోంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

read more : Bamma Bullet Bandi dance: బుద్దిగా కూర్చున్న తాత..‘బుల్లెట్ బండి’పాటకు డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ

ఎమోషన్స్ మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని మరోసారి నిరూపించిందీ గుర్రం. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. మరి ఈ గుర్రాన్ని కూడా సంగీతమే కదిలించింది. అందుకే చక్కగా మ్యూజిక్ కు అనుగుణంగా తలఊపుతో అందరికీ ఆకట్టుకుంటోంది.

Read more ; Kerala : కరోనా వర్రీ, కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

ఈ వీడియోలో ఓ అమ్మాయి మ్యూజిక్ వింటూ పాటను ఎంజాయ్ చేస్తోంది. ఆ సమయంలో తన తలను ఆ మ్యూజిక్‌కు అనుగుణంగా ఆడిస్తుండగా.. అక్కడికి వచ్చిన ఓ గుర్రం కూడా ఆపాటకు తలను ఆడిస్తూ పాటను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ గుర్రంపై మీరు ఓ లుక్కేయండి.