మెనుస్ట్రువల్ కప్.. మహిళల్లో నెలసరిని ఎలా మారుస్తున్నాయి.. ఇంతకీ ఎలా వాడాలి? ప్రయోజనాలేంటి?

మెనుస్ట్రువల్ కప్.. ఇదో రకమైన ఫెమినైన్ హైజీన్ ప్రోడక్ట్. సిలికాన్‌తో తయారు చేసిన ఈ కప్‌ను పీరియడ్స్ సమయంలో వాడుతారు. ఈ మెనుస్ట్రువల్ కప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్యాడ్ వంటి వాటి కంటే పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ కంట్రోల్ చేయగలదు. పీరియడ్స్ ఎక్కువగా అవుతుంటే మాత్రం… ఈ కప్‌ను 12గంటల వరకూ కూడా వాడచ్చు.
ప్రతి నెల పూర్తి వారంలో, మెలిస్సా అనే మహిళ తన సాధారణ బట్టల కింద షార్ట్స్ ధరించేది. ప్రతి రెండు గంటలకు ఆమె ప్యాడ్‌ను మార్చుకున్నప్పటికీ, ప్యూర్టో రికోకు చెందిన 26 ఏళ్ల ఆమెకు ఎక్కువగా పిరియడ్స్ అవుతుండేవి. అంతకుముందు తాను పిరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్స్, టాంపూన్స్, నాప్కిన్స్ వాడుతుండేది. మెనుస్ట్రువల్ కప్పుకు మారిన తరువాత మెలిస్సా పిరియడ్స్ సమయం ఏడు నుండి ఎనిమిదికి బదులుగా ఐదు లేదా ఆరు రోజులకు తగ్గిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. 1937లోనే మెనుస్ట్రువల్ కప్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, సాంప్రదాయ పద్ధతులతో అంతగా ప్రాచుర్యం పొందలేదు.
సిలికాన్ తో తయారైన ఈ మెనుస్ట్రువల్ కప్స్ ఎంతో నేచురల్ గానూ ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది. పిరియడ్స్ సమయంలో బయటకు వచ్చే రక్తస్రావాన్ని ఇది అడ్డుకుంటుంది. మెనుస్ట్రువల్ కప్ వాడకానికి సంబంధించి ఈ జూన్ నెలలో 1400 మంది మెనుస్ట్రువల్ కప్ యూజర్లు తమ అనుభవాన్ని ఫేస్ బుక్ కమ్యూనిటీ పేజీలో పంచుకున్నారు. మెనుస్ట్రువల్ కప్ లోకి మారిన తర్వాత వారిలో 53 మంది తమ పిరియడ్స్ బ్లడ్ కొద్దిరోజుల్లే తగ్గిపోయిందని చెప్పారు. పరిశోధకులు, వైద్య నిపుణులు, విద్యావేత్తలు, కప్ తయారీదారులు దీని పనితీరు గురించి బాగా తెలుసు. అంతేకాదు.. దీనిపై ఒక్క శాస్త్రీయ అధ్యయనం కూడా పరిశీలించలేదు.
ఫేస్‌బుక్ గ్రూప్ సభ్యురాలు జెన్.. తన ప్రసవం తర్వాత ఆమె పిరియడ్స్ క్రమం తప్పాయి. టెక్సాస్‌కు చెందిన 39 ఏళ్ల ప్రతి 45 నిమిషాలకు టాంపోన్ మార్పు కోసం బాత్రూంలోకి పరిగెత్తవల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఒక ఏడాది వరకు కప్పును ఉపయోగించిన తరువాత.. రక్తస్రావం ఆరు రోజుల నుంచి రెండు రోజుకు రక్తస్రావం తగ్గిపోయిందని ఆమె తన మెసేజ్‌లో తెలిపింది. ఇంతకీ మెనుస్ట్రువల్ కప్ ఎలా వాడాలో తెలుసుకుందాం. దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎలా వాడాలంటే..
మెనుస్ట్రువల్ కప్‌ని వాడాలనుకుంటే మీరు ముందు ఓసారి మీ వైద్యున్ని సంప్రదించండి. ఏ సైజ్ లో కావాలో తెలుసుకోవచ్చు. మార్కెట్లో దొరికే చాలా బ్రాండ్స్ స్మాల్, లార్జ్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్ లైన్‌లో లేదా మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. మీరు సరిగ్గా ఇన్సర్ట్ చేసి ఉంటే లోపల కప్ ఉందనే ఫీల్ కాకూడదు. లోపల ఏదో ఉందని అనిపించదు. ఎప్పటిలానే అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు.
* చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* కప్ అంచుని నీటితో తడపండి.
* అంచు పైకి ఉండేలా.. కప్‌ని ఒక చేతితో మడిచి పట్టుకోవాల్సి ఉంటుంది.
* ఈ కప్ నెమ్మదిగా యోని లోపలికి ఇన్‌సర్ట్ చెయ్యండి.
* కప్ లోపలికి దూర్చిన తరువాత అటు ఇటు తిప్పండి.
* ఎయిర్ టైట్ సీల్ ఏర్పడుతుంది.. లీక్ కాదు.
ఈ కప్ ఎప్పుడు బయటికి తీయాలంటే? :
మీ పీరియడ్ ఫ్లో అనుసరించి కప్ బయటకు తీయాల్సి ఉంటుంది. 6 నించి 12 గంటల వరకూ అలానే ఉంచవచ్చు. ఆ తర్వాత వెంటనే తీసేయాలి. ముందే కప్ నిండిపోతే 12 గంటల లోపే తీసేయండి.. లేకపోతే లీక్ అయిపోతుంది.
బయటికి తీసేటప్పుడు ఇలా చేయండి :
* చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
* బొటన వేలు, చూపుడు వేలు యోనిలోకి పెట్టండి. కప్ కింది మొన భాగాన్ని పట్టుకుని పై వేళ్లతో పైభాగంలో పట్టుకుని నెమ్మదిగా లాగాలి.
* గట్టిగా నొక్కితే సీల్ ఓపెన్ అయిపోతుంది.
* నెమ్మదిగా కప్ కిందకి లాగేందుకు ప్రయత్నించండి.
* కప్ బయటకు తీసిన తర్వాత బ్లడ్ క్లీన్ చేయండి.
* రోజుకి కనీసం రెండు సార్లు కప్ మార్చాలి.
ప్రయోజనాలివే :
* ఈ కప్ ఒక్కసారే కొంటే ఎన్నిసార్లు అయినా వాడొచ్చు.
* టాంపూన్స్, నాప్కిన్స్ అయితే ఎప్పుడూ కొంటూనే ఉండాలి.
* టాంపాన్స్ వాడడం కంటే కప్ వాడడం ఎంతో సురక్షితం.
* నాప్కిన్స్, టాంపూన్స్ కంటే ఈ పీరియడ్ కప్ ఎక్కువ రక్తాన్ని లీక్ కాకుండా ఆపుతుంది.
* తిరిగి వాడే మెనుస్ట్రువల్ కప్ వాడకం ఎకో-ఫ్రెండ్లీ ఆప్షన్ గా చెప్పవచ్చు.
* రీయూజబుల్ కప్స్ ని సెక్స్ ముందు బయటికి తీసెయాలి.
* సాఫ్ట్ డిస్పోజబుల్ కప్ సెక్స్ టైంలో కూడా వాడొచ్చు.
* మీ పార్ట్నర్ కు మీ యోనీలో కప్ ఉన్న విషయం కూడా తెలియదు.
* అంతా సౌకర్యంగానూ ఇన్ఫెక్షన్లు లేకుండా హెల్తీగా ఉంటుంది.