Afghanistan : కాబూల్ లో మళ్లీ భారీ పేలుడు
ఇవాళ కాబూల్ లో మరో భారీ పేలుడు సంభవించింది.

Kabul
Afghanistan వరుస బాంబు పేలుళ్లతో అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లుతోంది. కాబూల్ లో మరిన్ని బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందన్న అమెరికా హెచ్చరికల సమయంలోనే ఇవాళ కాబూల్ లో మరో భారీ పేలుడు సంభవించింది.
కాగా, ఓ రాకెట్… ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ ని ఢీకొట్టిందని..పేలుడుకి ఇదే కారణమని ప్రాధమిక సమాచారం. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు,ఎంతమంది గాయపడ్డారు అన్న పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా,ఇటీవలే కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 150మందికి పైగా అప్ఘాన్ పౌరులు,అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటికే ఐసిస్-కే ఉగ్రసంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
READ కాబూల్లో మరో ఉగ్రదాడికి కుట్ర
READ US military: మరో 24నుంచి 36 గంటల్లో ఉగ్రదాడి జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన