China : చైనాలో పేలుడు, 12 మంది మృతి

China : చైనాలో పేలుడు, 12 మంది మృతి

Huge Explosion In Chinas Hubei Province

Updated On : June 13, 2021 / 7:35 PM IST

Huge Explosion : చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. పేలుడు సంభవించి 12 మంది మృతి చెందారు. హుబీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో చోటు చేసుకుంది. దాదాపు 138 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఫుడ్ మార్కెట్ భవనం కుప్పకూలిపోయింది. ఓ నివాస సదుపాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని సీసీటీవీ కథనం ప్రసారం చేసింది. జనావాసాల మధ్య పేలుడు జరగడంతో ఇంకా ఎక్కువమంది మరణించి ఉండవచ్చునని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 150 మందిని కాపాడారు.

యాన్ హూ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుందని హాంకాంగ్ లోని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. అయితే పేలుడు ఎలా జరిగిందో తెలియడం లేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. 37 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. శిథిలాల కింద ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 2013లో క్వింగ్ డాలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 55 మంది చనిపోయారు.

Read More : Telangana : టి.సర్కార్‌‌పై కాంగ్రెస్ నేతల మండిపాటు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే