Hurricane Otis: మెక్సికోలో ఓటిస్ హరికేన్ ముప్పు…వెరీ డేంజరస్

మెక్సికో దేశంలో ఓటిస్ హరికేన్ ప్రభావం వల్ల పలుప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఫలితంగా గంటలకు 165 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి....

Hurricane Otis: మెక్సికోలో ఓటిస్ హరికేన్ ముప్పు…వెరీ డేంజరస్

Hurricane Otis

Updated On : October 26, 2023 / 12:51 PM IST

Hurricane Otis: మెక్సికో దేశంలో ఓటిస్ హరికేన్ ప్రభావం వల్ల పలుప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన హరికేన్ ఫలితంగా గంటలకు 165 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మెక్సికోలోని అకాపుల్కోలో ఓటిస్ హరికేన్ తీరాన్ని తాకింది. కేటగిరీ 5 తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల జనావాస ప్రాంతాల్లో వరదలకు దారితీసింది.

Also Read :  ED searches : రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు

తుపాను కారణంగా హైవేలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల జనావాస ప్రాంతాలు ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. తుపాన్ వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఉపగ్రహం అందించిన ఉపగ్రహ చిత్రాలు ఓటిస్ ఉష్ణమండల తుపాను నుంచి పెద్ద హరికేన్‌గా బలపడుతున్నట్లు చూపిస్తుంది.

Also Read : Z category security : బీజేపీ లీడర్ బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ

తుపాన్ తీరం దాటడం వల్ లఅకాపుల్కోలోవద్ద పర్యాటక ప్రాంతం దెబ్బతింది. భారీవర్షాలు, వరదలతో మెక్సికోలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి.