విక్రమ్ ల్యాండర్.. రోజుకి 7-8 గంటలు స్కాన్ చేశాను : ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్

  • Published By: chvmurthy ,Published On : December 3, 2019 / 07:42 AM IST
విక్రమ్ ల్యాండర్.. రోజుకి 7-8 గంటలు స్కాన్ చేశాను : ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్

Updated On : December 3, 2019 / 7:42 AM IST

చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉప‌రిత‌లంపై కూలిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను గుర్తించ‌డంలో  చెన్నైకి చెందిన భార‌తీయ ఇంజినీర్‌, ఔత్సాహిక ఖ‌గోళ శాస్త్ర‌వేత్త ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు నాసా చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఓ సాధార‌ణ పిక్ నుంచే తాను ల్యాండ‌ర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించ‌గ‌లిన‌ట్లు ష‌ణ్ముగ చెప్పాడు. 

నాసా విడుదల చేసిన రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఆ ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు తెలిపాడు. విక్ర‌మ్ శిథిలాలు అలాగే బ‌య‌ట‌ప‌డ్డాయ‌న్నారు. అయితే తాను క‌నుగొన్న విష‌యాన్ని నాసా ద్రువీక‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. 

లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను నాలుగైదు రోజుల పాటు క‌నీసం 7-8 గంట‌లు స్కాన్ చేసిన‌ట్లు చెప్పాడు. కొద్దిగా తెలివైన వాళ్లు దీన్ని గుర్తించ‌గ‌లర‌న్నాడు. ఒక ర‌కంగా త‌న శోధ‌న అనేక మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని ష‌ణ్ముగ తెలిపాడు.