Facebook, Twitterలపై కన్ను.. పాక్ ముందు జాగ్రత్త

Facebook, Twitterలపై కన్ను.. పాక్ ముందు జాగ్రత్త

Updated On : February 14, 2020 / 4:48 AM IST

పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీలన్నీ చట్ట వ్యతిరేకపరమైన కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం.. కంపెనీలు అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించారు. మీడియా సెన్సార్ షిప్‌పై ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 

సోషల్ మీడియా కారణంగా పాకిస్తాన్  మిలటరీ విభాగం సైతం విమర్శలను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు స్థానికంగా పాకిస్తాన్‌లో బ్రాంచ్ లు ఓపెన్ చేయాలని 24గంటల తమకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 

దీనిపై సోషల్ మీడియా కంపెనీలకు 24గంటల సమయం మాత్రమే ఇచ్చారు. టెర్రరిజమ్, ఎక్స్‌ట్రీమిజమ్, ద్వేష పూరితమైన కామెంట్లు, పరువుకు భంగం కలిగించే వార్తలు, ఫేక్ వార్తలు, హింసను ప్రేరేపించేవి, జాతీయ భద్రత కలిగించేవి అకౌంట్ల నుంచి తొలగించాలని కొత్త రూల్స్‌లో ఉంది. మూడు నెలల్లోగా పాకిస్తాన్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్ కంపెనీలు అకౌంట్లు తెరవాలని ముఖ్య ఉద్దేశ్యం. 

అడిగినప్పుడు సబ్‌స్క్రైబర్ సమాచారం,  ట్రాఫిక్ డేటా, కంటెంట్ డేటా, ఇతర సమాచారం ఇవ్వాలని అందులో ఉంది. ఏ కమ్యూనిటీనైనా కించపరిచే పాలసీని రద్దు చేయాలని సారాంశం.