Imran Khan: ఏం జరిగినా సరే.. ‘తగ్గేదేలే’ అంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్‌ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్‌బాల్ స్టార్ షుమైలా సత్తార్‌తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్‌లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ సభ్యురాలు.

Imran Khan: ఏం జరిగినా సరే.. ‘తగ్గేదేలే’ అంటున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Pakistan Ex PM Imran Khan

Pakistan: ప్రభుత్వం తనను జైలులో పెట్టినా వెనుకాడనని, తాను లొంగిపోనని, పాకిస్తాన్‭లో చట్టబద్ధమైన పాలన కోసం పోరాడుతూనే ఉంటానని ఆ దేశా మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. వాస్తవానికి ఇమ్రాన్ మీద పలు సెక్షల మీద తీవ్ర కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగుస్తోంది. బెయిల్ పొడగింపు కోసం సోమవారం ఇస్లామాబాద్ వెళ్లారు. దీనికి ముందు యూట్యూబ్ ద్వారా పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Heat Waves: వేడిగాలులపై కేంద్రం హైలెవల్ సమావేశం.. రాష్ట్రాల్లో పర్యటనకు ప్రత్యేక బృందం

“నన్ను జైలులో పెట్టినా నేను ప్రభుత్వానికి లొంగిపోను. చట్టబద్ధమైన పాలన, నా దేశ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాను” అని యూట్యూబ్ ద్వారా ఇచ్చిన ఖాన్ సందేశం ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌పై 140కి పైగా కేసులు ఉన్నాయి. అయితే ఇందులో ఉగ్రవాదం, హింస, దహన దాడులు, దైవదూషణ, హత్యాయత్నం, అవినీతి, మోసానికి ప్రజలను ప్రేరేపించడం వంటి 19 తీవ్రమైన కేసులు ఉన్నాయి. వీటి విషయంలోనే బెయిల్ కోసం సోమవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లారు.

Bengal Politics: మమతా బెనర్జీకి చుక్కెదురు.. హైకోర్టు ఉత్తర్వుల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు

ఇదిలా ఉండగా, లాహోర్‌లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్‌ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్‌బాల్ స్టార్ షుమైలా సత్తార్‌తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్‌లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ సభ్యురాలు. మే 9న లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ హౌస్‌పై దాడికి సంబంధించి సత్తార్‌ను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. సైనిక న్యాయస్థానాలలో పౌరులపై విచారణకు వ్యతిరేకంగా పిటిషనర్‌గా ఉన్న ఒక సీనియర్ న్యాయవాది కూడా లాహోర్‌లో ఖాన్‌ను కలిసిన తర్వాత కిడ్నాప్ అయ్యాడని ఒక అధికారి తెలిపారు.