India China : మరోసారి భారత్, చైనా మధ్య చర్చలు.. ఉద్రిక్తతలు తొలగేనా?
తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం

India China
India China : తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం(అక్టోబర్ 10,2021) 13వ విడత ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు జరగనున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్ దగ్గర రేపు ఉదయం 10.30 గంటలకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చర్చించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య జూలై 31న 12వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.
Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..
దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన చర్చల్లో తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రాతో పాటు పలు కీలకమైన ప్రాంతాల్లో బలగాలు, ఆయుధాలను తర్వగా ఉపసంహరించాలని భారత్ స్పష్టం చేసింది. అంతకు ముందు జూలై 14న భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. చైనా మంత్రి వాయింగ్ యీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. షాంఘై సహకార సమావేశం (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న పరిస్థితులు, సమస్యలపైనా చర్చించారు.
Lexus ES 300h : భారత్‌లో లెక్సస్ లగ్జరీ కారు విడుదల.. ధర ఏంటంటే?
తూర్పు లడఖ్ లో గతేడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలు భారీగా సైన్యాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 12 సార్లు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది జులైలో ఉభయ దేశాల సైనిక కమాండర్లు భేటీ అయ్యారు. ఈ చర్చలకు అనుగుణంగా పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల దగ్గర రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. అయితే ఘర్షణకు కేంద్ర బిందువులుగా ఉన్న మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. రేపటి చర్చల్లో హాట్‌స్ప్రింగ్స్‌తో పాటు గోగ్రా లోయ, దెమ్‌చోక్‌ల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.