అమెరికాలో భహిరంగ సభలో భారత్‌పై ట్రంప్ ప్రశంసలు

భారతీయ సంస్కృతిలో భాగమైన ‘అతిథి దేవోభవ’ అంటూ ట్రంప్‌కు అహ్మదాబాద్ పురవీధుల్లో ఘన స్వాగతం పలికారు భారతీయులు. ‘ప్రత్యేక మిత్రుడు’ ట్రంప్‌కు ప్రధాని మోడీ హృదయపూర్వక స్వాగతం పలికారు. తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టిన అగ్ర రాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆతిథ్యానికి పులకించిపోయారు. భారతీయ ఔన్నత్యాన్ని తిరిగి వెళ్లిన తర్వాత కూడా మర్చిపోట్లేదు.
ట్విట్టర్ వేదికగా ఇప్పటికే భారత్‌పై ప్రశంసలు కురిపించిన ట్రంప్ అక్కడి భహిరంగ సభల్లో కూడా భారత్ ఇచ్చిన ఆతిధ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అమెరికాలోని సౌత్ కరోలినాలో బహిరంగ సభలో మాట్లాడుతూ.. “ఇక్కడ ఇంత మందిని చూస్తున్నా… నాకు పెద్దగా ఆనందం, ఆశ్చర్యం కలగట్లేదు. ఎందుకంటే… ఇండియాలోని మోతేరా స్టేడియంలో ఇంతకంటే భారీ సంఖ్యలో వచ్చిన ప్రజల్ని చూశాను” అని అన్నారు ట్రంప్.
ఇండియాలో ఆ స్టేడియంలో లక్షా 29వేల మంది ఉన్నారు. అంత మందిని ఎప్పుడైనా చూశారా. అక్కడ మొత్తం జనాభాయే. వాళ్లు చాలా మంది కంటే బాగా నిర్వహించారు. లక్ష మంది వస్తారని చెప్పారు. కానీ లక్షా 29 వేల మంది అక్కడకు వచ్చారు. దట్ వాజ్ నాట్ బ్యాడ్. ఆ స్టేడియం ఎలా ఉందంటే… మధ్యలో మైదానం కంటే… చుట్టూ ఉండే గ్యాలరీ మూడు రెట్లు పెద్దదిగా ఉంది.
మన అమెరికాలో 40 నుంచీ 50 వేల మంది మహా అయితే 60 వేల మంది వస్తారు. ఇదే సభలో 15 వేల మంది ఉంటే ఎలా ఉంటుంది. అరే ఇంత తక్కువ మందా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది. అని అన్నారు ట్రంప్.
THANK YOU SOUTH CAROLINA! pic.twitter.com/7i5BYCQfg8
— Donald J. Trump (@realDonaldTrump) February 29, 2020