Pakistani Air Crafts Downed: పాకిస్తాన్‌కు చావుదెబ్బ.. భారత్ ప్రతిదాడులు, పాక్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ ధ్వంసం, ఫైటర్ జెట్లు కూల్చివేత..

మన దేశంలోకి ప్రవేశించిన క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది.

Pakistani Air Crafts Downed: పాకిస్తాన్‌కు చావుదెబ్బ.. భారత్ ప్రతిదాడులు, పాక్ ఎయిర్ వార్నింగ్ సిస్టమ్ ధ్వంసం, ఫైటర్ జెట్లు కూల్చివేత..

Updated On : May 8, 2025 / 11:14 PM IST

Pakistani Air Crafts Downed: పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత ఆర్మీ ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్ సహా 9 నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పాక్ పంజాబ్ లోని ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ను భారత్ ధ్వంసం చేసింది. మరోవైపు S400, L70, ZSU 23, శిఖ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లను భారత్ యాక్టివేట్ చేసింది. మన దేశంలోకి ప్రవేశించిన పాక్ క్షిపణులు, 3 ఫైటర్ జెట్లు (ఒక ఎఫ్-16, 2 జేఎఫ్ 17), భారీగా డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. లాహోర్, సియాల్ కోట్ లో నూ ఇండియన్ ఆర్మీ మిస్సైల్ దాడులకు దిగింది.

జమ్మూ, పంజాబ్‌లోని పలు ప్రదేశాలపై పాక్ దాడుల తర్వాత భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్‌కు చెందిన ఒక F-16, రెండు JF-17 విమానాలను కూల్చివేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వైమానిక హెచ్చరిక నియంత్రణ వ్యవస్థ (AWACS)ను కూడా కూల్చివేసింది. అటు జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్.. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూడా పాక్ డ్రోన్ దాడులను భారత ఆర్మీ తిప్పికొట్టింది. అఖ్నూర్‌లో డ్రోన్‌ను కూల్చివేసింది. పూంచ్‌లో రెండు కామికేజ్ డ్రోన్‌లను కూడా కూల్చేసింది.