మోడీ, ట్రంప్ టెలీఫోన్ సంభాషణ..కరోనా నియంత్రణపై సుదీర్ఘ చర్చ
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ టెలీఫోన్ సంభాషణ జరిపారు. కరోనా వైరస్ ను నియంత్రించడంపై ఫోన్ లో ఇరువురు సుదీచర్ఘంగా చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కరోనాపై పోరాటం చేయడానికి కలిసికట్టుగా సర్వశక్తులు ఒడ్డేందుకు నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. ట్రంప్ తో సుదీర్ఘంగా సాగిన చర్చలో ఇరుదేశాల భాగస్వామ్యంతో కరోనాను నియంత్రించేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు.
కరోనా వైరస్ తో అమెరికా బెంబేలెత్తిపోతోంది. ఇప్పటివరకు యుఎస్ లో 2.79 లక్షల మందికి కరోనా సోకింది. వైరస్ తో 7 వేల 451 మంది మరణించారు. కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 3 వేల 72 కేసులు నమోదు అయ్యాయి. 75 మందికి పైగా మృతి చెందారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని 30శాతం జిల్లాలకు కరోనా పాకింది. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.
కరోనాని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వానికి మరింత సవాల్ గా మారింది. దేశవ్యాప్తంగా 720 జిల్లాలు ఉంటే, 211 జిల్లాల్లో కరోనా బాధితులు ఉన్నారు. 211 జిల్లాల్లో కొన్ని చోట్ల 60శాతం మంది కరోనా బారిన పడ్డారు. మరికొన్ని చోట్ల 30శాతం మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య తెలిపింది.