గూగుల్ ఎర్త్ అద్భుతమైన ఫొటోలు చూశారా? డౌన్‌లోడ్ చేసుకోండి

గూగుల్ ఎర్త్ ఇటీవలే ఎర్త్ వ్యూకు 1,000కి పైగా కొత్త ఫొటోలను జోడించింది. ఏడు ఖండాల నుండి 2,500కు పైగా పక్షి కన్నుతో చూస్తే కనిపించేలా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను విడుదల చేసింది. ఇందులో ఇండియాలోని వివిధ ప్రకృతి దృశ్యాలకు చెందిన 35కి పైగా ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి. ‘ఎర్త్ వ్యూ మన మనస్సులను చిన్న తెరల నుండి బాహ్య అంతరిక్షానికి పెంచే శక్తిని కలిగి ఉంది.
మొత్తంగా గూగుల్ ఎర్త్ ద్వారా ఎంతో అద్భుతమైన భూగ్రహంపై కనిపించే దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా వీక్షించవచ్చు’ అని గూగుల్ ఎర్త్ ప్రొడక్ట్ మేనేజర్ గోపాల్ షా తెలిపారు. మీ కోసం సేకరించిన ఛాయాచిత్రాలలో కొన్ని ఇక్కడ ఉన్నాయి.
గూగుల్ ఎర్త్ జోడించిన మొత్తం 2,500 ఫొటోలను చూడొచ్చు. ‘పదేళ్ల క్రితం.. నేను శాన్ ఫ్రాన్సిస్ కో వెళ్తున్నాను. కాలిడోస్కోపికల్ అందమైన దృశ్యాన్ని విమానం చిన్న కిటికీ బయటకు తెరిచి ఉంది. ఇంటికి వచ్చాక గూగుల్ ఎర్త్ మరింత దగ్గరగా పరీక్షించి చూశాను’ అని షా తెలిపారు.
అద్భుతమైన దృశ్యాలను గూగుల్ ఎర్త్ వ్యూ ద్వారా శాటిలైట్లు చిత్రించిన కొత్త ఫొటోలను గూగుల్ విడుదల చేసింది. మీ స్మార్ట్ ఫోన్లు లేదా కంప్యూటర్ స్ర్కీన్లపై వాల్ పేపర్లు లేదా స్ర్కీన్ సేవర్లుగానూ సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫొటోలను సెలక్ట్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ అద్భుమైన భౌగోళిక దృశ్యాలను ఓసారి లుక్కేయండి..
గూగుల్ ఎర్త్ వ్యూ ద్వారా తీసిన 2,500 ఛాయాచిత్రాలను చూడాలంటే Google Earth View లింక్ క్లిక్ చేయండి.