Chinook Chopper: చినూక్ హెలికాప్టర్లను పక్కన పెట్టిన అమెరికా.. భారత్ ఆర్మీ అభ్యంతరం..

సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్ హెలికాప్ట‌ర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్ కమాండ్ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Chinook Chopper: చినూక్ హెలికాప్టర్లను పక్కన పెట్టిన అమెరికా.. భారత్ ఆర్మీ అభ్యంతరం..

Chinook Helicopter

Updated On : August 31, 2022 / 2:52 PM IST

Chinook Chopper: సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్ హెలికాప్ట‌ర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్ కమాండ్ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్ లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీలోని మెటీరియల్ కమాండ్ తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల ఆందోళణ వ్యక్తం చేసిన భారత్.. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది.

Pakistan Floods: వాళ్లు మారరు..! వరదల్లో పాక్.. సాయమందించేందుకు సిద్ధమైన భారత్ .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని..

చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. ఈ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచి దళాల రవాణా, విపత్తు సహాయక చర్యలు, క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం హెలికాప్టర్లను ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, భారత్ తదితర దేశాలు వినియోగిస్తున్నాయి. భారత్ వాయుసేనలో ప్రస్తుతం 15 చినూక్ లు సేవలు అందిస్తున్నాయి. చినూక్ హెలికాప్టర్‌ల యొక్క భారతీయ విమానాలు ఉత్తరాన కార్యకలాపాల కోసం చండీగఢ్‌లో ఉండగా, ఈశాన్య ప్రాంతంలో కార్యకలాపాల కోసం అస్సాంలో మరొక యూనిట్ ఉంది

Zomato Online Delivery: జొమాటోలో కొత్త సేవలు.. ఇతర నగరాల్లోని ఆహారం మీ ఇంటికొస్తుంది.. కానీ, కొన్ని షరతులు ..

అయితే.. హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగడానికి గల కారణాలను సైన్యం గుర్తించిందని, ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టామని అమెరికా సైన్యం అధికార ప్రతినిధి సింతియా ఓ స్మిత్ పేర్కొన్నారు. ఈ హెలికాప్టర్లను పక్కనపెట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని అమెరికా సైన్యం తెలిపినట్లు సమాచారం. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంలో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై స్పందించేందుకు బోయింగ్ సంస్థ నిరాకరించింది.