Indian couples: వామ్మో.. ట్రంప్ ఎత్తుకి.. ఇండియన్స్ పైఎత్తు.. పిల్లలు త్వరగా పుట్టడానికి..

సిజేరియన్ విధానంలో పిల్లలను కంటామని ఆసుపత్రులకు వెళ్తున్నారు.

Indian couples: వామ్మో.. ట్రంప్ ఎత్తుకి.. ఇండియన్స్ పైఎత్తు.. పిల్లలు త్వరగా పుట్టడానికి..

Updated On : January 23, 2025 / 8:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలసలను కట్టడి చేసేందుకు.. జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు ఈ నెల 20న జారీ కాగా, ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఆ లోపే పిల్లలను కనేయాలని చాలా మంది భారతీయులు ఆసుపత్రులకు వెళ్తున్నారు.

ఇప్పటికే గర్భం దాల్చినవారు నెలలు నిండకముందే డెలివరీ డేటును ముందుకు జరుపుకోవాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ విధంగా తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం వచ్చేలా చేయాలన్నదే వారి ప్లాన్‌.

సిజేరియన్ విధానంలో పిల్లలను కంటామని ఆసుపత్రులకు వెళ్తున్నారు. జంటలు సీ సెక్షన్ కోసం తొందరపడుతుండడంతో ఆసుపత్రుల వద్ద వారి సంఖ్య అధికంగా కనపడుతోంది. ప్రసూతి క్లినిక్‌ల వద్ద భారతీయ జంటలు బారులు తీరి కనపడుతున్నారు.

అయితే, కాన్పు సమయం రాకముందే సీ సెక్షన్ ద్వారా పిల్లలను కంటే తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే గర్భంతో ఉన్న ప్రతి భారతీయ మహిళా దీని గురించే ఆలోచిస్తోంది.

ఈ నెల 19 తర్వాత.. అమెరికా పౌరులు మినహా మిగతా దేశాల జంటలకు జన్మించిన పిల్లలు సహజ యూఎస్‌ఏ పౌరులు కాకుండా పోతారు. అమెరికాలో తాత్కాలిక హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలపై చాలా మంది పనిచేస్తున్నారు. అదే.. అందరి లక్ష్యం ఒక్కటే తమ పిల్లలకు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలి. ఈ నెల 20 నుంచి పుట్టే పిల్లలకు పుట్టుకతో లభించే అమెరికా పౌరసత్వం దక్కదు. ముందస్తు డెలివరీ చేయాలని 8, 9వ నెల గర్భిణులు పట్టుబడుతున్నారు.

ఓరినాయనో.. భార్యను చంపడానికి ముందు ప్రాక్టీస్ కోసం.. గురుమూర్తి ఇంకో ఘాతుకం