తెలుగు దంత వైద్యురాలు మిస్సింగ్

ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి అదృశ్యం స్థానిక తెలుగు వర్గాలలో కలకలం సృష్టిస్తుంది. 32 సంవత్సరాల ప్రీతీ రెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. సిడ్నీలో నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. సిడ్నీలో ఎంతో రద్దీగా ఉండే జార్జ్ స్ట్రీట్ లో ఓ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ వద్ద ప్రీతి చివరిసారిగా కనిపించినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రీతి రెడ్డి బతికుండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసు విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంలో తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఆదివారం నాడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ప్రీతి రెడ్డి వారాంతంలో సెయింట్ లియొనార్డ్స్ లో జరిగిన ఓ డెంటల్ సదస్సులో పాల్గొందని వారు చెబుతున్నారు. సిడ్నీ మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకుని ఇంటికి వస్తానంటూ చెప్పి వెళ్లిన ఆమె ఆచూకీ తెలియకపోవడంతో నేపియన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు.