గురి చూసి కొట్టారు : పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్
పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్‌లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి

పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్‌లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి
పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదు. తన వైఖరి మార్చుకోలేదు. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోర్డర్‌లో కాల్పులకు తెగబడటమే కాకుండా.. మన భూభాగంలోకి చొచ్చుకుని వస్తోంది. పాక్ యుద్ధ విమానాలు మన భాభూగంలో చక్కర్లు కొట్టడం, వాటిని మనం కూల్చేయం తెలిసిందే. తాజాగా పాక్ మరో దుస్సాహసం చేసింది. భారత గగనతలంలోకి డ్రోన్ ను పంపించింది. వెంటనే గుర్తించిన మన భద్రతా బలగాలు.. పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చివేశాయి.
Also Read : ఇండిగో ‘రన్‌వే సేల్’ ఆఫర్ : రూ.899లకే విమాన టికెట్
రాజస్థాన్‌లోని బికనేర్ నల్ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం(మార్చి 4) ఉదయం 11.30 గంటలకు ‘సుఖోయ్ 30ఎంకేఐ’ ద్వారా ఆ డ్రోన్‌ను కూల్చేశామని అధికారులు తెలిపారు. భారత గగనతల నిబంధనలను ఉల్లంఘిస్తూ పాక్ ఈ చర్యకు పాల్పడిందని అధికారులు చెప్పారు. ‘ఆ సరిహద్దు ప్రాంతంలోకి పాక్‌కు చెందిన డ్రోన్ ప్రవేశించిన వెంటనే గుర్తించిన భారత్.. దాన్ని పేల్చేసింది. భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి, వెంటనే ప్రతిస్పందించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది’ అని అధికారులు వివరించారు.
Also Read : పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్
గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌బేస్ సమీపంలో ఇటీవల పాక్‌కు చెందిన మరో డ్రోన్‌ని భారత్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్ భారత భూభాగంలోకి చొచ్చుకురాగా ఆ డ్రోన్‌ను కూల్చేశారు. ఆ ఘటన మరవక ముందే పాక్‌కు చెందిన మరో డ్రోన్ భారత గగనతలంలోకి రావడం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
Also Read : ఇది కొంచెం ఢిఫరెంట్… బీర్ బాత్ టబ్ ఛాలెంజ్ చూశారా?