Pakistan In Danger: డేంజర్‌లో పాకిస్తాన్..! భారత్ కనుక ఇలా చేసిందంటే.. పాక్‌లో వినాశనమే..!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Pakistan In Danger: డేంజర్‌లో పాకిస్తాన్..! భారత్ కనుక ఇలా చేసిందంటే.. పాక్‌లో వినాశనమే..!

Updated On : November 1, 2025 / 7:12 PM IST

Pakistan In Danger: పాకిస్తాన్ లో 80 శాతం వ్యవసాయం సింధు నదీ పరీవాహక ప్రాంతం నుండి వచ్చే నీటిపైనే (ఇండస్) ఆధారపడి ఉంది. అయితే, ఈ బేసిన్ అత్యధిక భాగం భారత్ లో ఉంది. దీంతో నీటి ప్రవాహాన్ని భారత్ ఏమాత్రం ఆపినా పాక్ లో వినాశనం తప్పదన్న హెచ్చరికలు చేసింది పర్యావరణ ముప్పు నివేదిక 2025. పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని తెలిపింది. పాక్‌లోని సింధు నది ఆనకట్టల్లో 30 రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదంది. దీని వల్ల దీర్ఘకాలం పాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.

సింధు నది ప్రవాహాన్ని మార్చగల సామర్థ్యం భారత్ కి ఉన్నందున తీవ్రమైన నీటి కొరత ప్రమాదాన్ని పాక్ ఎదుర్కొంటుందని పర్యావరణ ముప్పు నివేదిక 2025 వెల్లడించింది. సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత సిడ్నీకి చెందిన లాభాపేక్షలేని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) ఒక నివేదిక వచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా భారత్ ప్రస్తుతం IWT కింద దాని నీటి భాగస్వామ్య బాధ్యతలకు కట్టుబడి లేదు. 1960 ఒప్పందం ప్రకారం, పశ్చిమ నదులైన సింధు, జీలం చీనాబ్ జలాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి భారత్ అంగీకరించింది. అదే సమయంలో బియాస్, రావి, సట్లెజ్‌ సహా తూర్పు నదులపై నియంత్రణను తన సొంత ఉపయోగం కోసం నిలుపుకుంది.

వేసవిలో పాక్ కు చుక్కలే..!

భారత్ నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకపోయినా లేదా మళ్లించలేకపోయినా.. ఆనకట్ట కార్యకలాపాలలో చిన్న సర్దుబాట్లు చేసినా చాలు పాక్ పై తీవ్ర ప్రభావమే పడనుంది. వేసవి వంటి కీలక సమయాల్లో పాక్ జనసాంద్రత కలిగిన ప్రాంతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాల్లో 80శాతం.. వ్యవసాయానికి సింధు పరీవాహక జలాలపై ఆధారపడ్డాయి. పాకిస్తాన్ నీటి నిల్వ సామర్థ్యం దాదాపు 30 రోజులే. దీని వల్ల ముందు ముందు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

మే నెలలో పాకిస్తాన్‌కు తెలపకుండానే చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బాగ్లిహార్ ఆనకట్టల వద్ద రిజర్వాయర్ ఫ్లషింగ్ నిర్వహించింది భారత్. ఆ తర్వాత, పాకిస్తాన్‌లోని చీనాబ్ వెంబడి వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. IWT సస్పెన్షన్ తర్వాత నది నిర్వహణపై భారత్ కలిగున్న వ్యూహాత్మక పరపతికి ఇది అద్దం పడుతుంది.

భారతే కాదు మరో దేశం ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కునార్ నదిపై ఆనకట్ట నిర్మించే తన ప్రణాళికను వేగవంతం చేసింది. అలా పాకిస్తాన్ సరిహద్దు జల సంపదను అడ్డుకుంది. పాకిస్తాన్ రైతులు ఇప్పటికే తీవ్రమైన వాతావరణ మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కరవులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నది ప్రవాహంలో తేడాలను నిరోధించడానికి పాకిస్తాన్‌లో తగినంత ఆనకట్ట నిల్వ లేదు. చిన్న అంతరాయాలు కూడా వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని IEP నివేదిక పేర్కొంది. “పాకిస్తాన్‌కు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. భారత్ నిజంగా సింధు ప్రవాహాలను గణనీయంగా తగ్గిస్తే, పాక్ జనసాంద్రత కలిగిన మైదానాలు, ముఖ్యంగా శీతాకాలం, పొడి సీజన్లలో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి” అని నివేదిక పేర్కొంది.

Also Read: పీవోకేలో యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన.. పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన భారత్..