Iran Attack America: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో అటాక్..

తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడింది ఇరాన్.

Iran Attack America: అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో అటాక్..

Updated On : June 24, 2025 / 12:00 AM IST

Iran Attack America: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ తో యుద్ధంలో తలదూర్చి తమపై దాడి చేయడంతో ప్రతీకార దాడులకు దిగింది. ఖతార్, ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా విరుచుకుపడింది. ఖతార్ రాజధాని దోహాలోని యూఎస్ కు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరం అల్ ఉదీద్ ఎయిర్ బేస్ పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఆరు మిస్సైళ్లతో అటాక్ చేసింది ఇరాన్. ఖతార్ తన గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడింది ఇరాన్. అల్ ఉదీద్ ఎయిర్ బేస్.. మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఇదే. అటు ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరంపైనా ఇరాన్ అటాక్ చేసింది. ఇరాక్‌లోని అమెరికా దళాలకు స్థావరంగా ఉన్న ఐన్ అల్ అసద్ స్థావరంపైనా దాడి చేసింది ఇరాన్.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. దీంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. చెప్పినట్లే అమెరికా సైనిక స్థావరం దాడి చేసింది. కనీసం ఆరు క్షిపణులను ప్రయోగించింది.

ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై ‘ఆపరేషన్ బషారత్ అల్-ఫాత్’ (విజయ ప్రకటన లేదా ఆపరేషన్ శుభవార్త అంటారు) కింద క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. తమ దేశంలోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో గగనతల మూసివేత నిర్ణయం తీసుకుంది ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి తర్వాత బహ్రెయిన్ కూడా ‘తాత్కాలికంగా’ విమాన రాకపోకలను నిలిపివేసింది.

ఖతార్ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు కీలకమైన కేంద్రమైన అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. మధ్యప్రాచ్యంలో అతిపెద్ద విమానయాన సంస్థలలో ఒకటైన ఖతార్ ఎయిర్‌వేస్‌కు కూడా నిలయం. అమెరికా తన అణు స్థావరాలపై బాంబు దాడి చేసి, అస్థిర ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచినందుకు ప్రతీకారంగా ఇరాన్ సోమవారం ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులను ప్రారంభించింది.

అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని ఖతార్ ఖండించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను విజయవంతంగా అడ్డగించామని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. తన గగనతలం సురక్షితంగా ఉందని చెప్పింది. గగనతల మూసివేతను ముందుజాగ్రత్త చర్యగా అభివర్ణించింది.

దోహా వెలుపల ఉన్న అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో అమెరికా దాదాపు 10వేల మంది సైనికులను నిర్వహిస్తోంది. ఇది మధ్యప్రాచ్యంలో అతిపెద్ద అమెరికన్ సైనిక స్థావరం. ఈ ప్రాంతం యూఎస్ కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది.