900 years old sword : సముద్రంలో స్కూబా డైవర్ కు దొరికిన 900 ఏళ్లనాటి ఖడ్గం

సముద్రంలో స్కూబా డ్రైవింగ్ కు వెళ్లిన ఓ వ్యక్తికి 900ల ఏళ్లనాటి ఓ ఖడ్గం దొరికింది. ఈ ఖడ్గం 900 ఏళ్ల క్రితం నాటి..క్రుసేడర్ల కాలం నాటిది పురాతన వస్తువుల అథారిటీ తెలిపింది.

900 years old sword : సముద్రంలో స్కూబా డైవర్ కు దొరికిన 900 ఏళ్లనాటి ఖడ్గం

Diver Pulls Out 900 Year Old Sword From Sea

Scuba diver discovers sword estimated to be 900 years old : అది ఉత్తర ఇజ్రాయెల్ లోని మధ్యదరా సముద్రం. ఓ స్కూబా డైవర్‌కు సముద్రంలోకి వెళ్లాడు. అతనికి ఓ చోట అత్యంత అరుదైన ఖడ్గం దొరికింది. తీరంలో పురాతన కాలం నాటి ఖడ్గం దొరికింది. శ్లోమి కాట్జిన్ అనే స్కూడా డైవర్‌కి మధ్యధరా సముద్రం అడుగుభాగన డైవింగ్‌ చేస్తున్నాడు. అక్కడ ఉండే అత్యద్భుతమైన వాటిని తన కెమరాతో బంధిస్తుండగా ఒక పొడవాటి ఖడ్గ పడి ఉండటం చూశాడు.

 Read more : Hyenas Dinner Spot :7 వేల ఏళ్లనాటి హైనాల డిన్నర్ స్పాట్..గుహనిండా గుట్టల కొద్దీ ఎముకలు

కత్తి బార్నాకిల్స్‌తో కప్పబడి ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అక్కడు ఓ ఖడ్గం ఉంది అంటూ ఈ చుట్టు పక్కల ఇటువంటివి ఏమన్నా ఉంటాయేమోనని వెతికాడు. అలా వెతగ్గా అతనికి మరికొన్ని పురాతన కళాఖండాలను కనిపించాయి. కత్తితో పాటు మరికొన్ని కళాఖండాలను తీసుకుని కాట్జిన్ పైకి వచ్చేసి వాటిని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి అప్పగించాడు.

Rear more: Ancient Wine Factory:తవ్వకాల్లో బయటపడ్డ 1500 ఏళ్ల నాటి మద్యం ఫ్యాక్టరీ..పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు..

కత్తిని పరిశీలించిన అథారిటీవారు అది 900 ఏళ్ల క్రితం నాటి..క్రుసేడర్ల కాలం నాటిది అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కత్తిని శుభ్రం చేసి ఆ తర్వాత దాని గురించి విశ్లేషిస్తామని రోబరీ ప్రివెన్షన్ యూనిట్ అథారిటీ ఇన్‌స్పెక్టర్ నిర్ డిస్టెల్‌ఫెల్డ్ తెలిపారు.ఆ కత్తి ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ నుంచి దోపిడీకి గురైనట్లు అథారిటీ అధికారులు తెలిపారు. అంతేకాదు కత్తిని పట్టుకొచ్చి తమకు అప్పగించినందుకు అథారిటీ అధికారులు కాట్జిన్‌కి మంచి పౌరసత్వ ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ దీనికి సంబంధించిన 2 నిమిషాల వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం నెట్లింట తెగ వైరల్‌ అవ్వడమే కాదు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Read more : ‘Cooper’ Dinosaur : ఆస్ట్రేలియాలో బైటపడ్డ భారీ డైనోసార్ అవశేషాలు..

ఈ సందర్భంగా పురాతన వస్తువుల అథారిటీ అధికారులు మాట్లాడుతు..ఉత్తర ఇజ్రాయెల్‌లో శ్లోమి కాట్జిన్ అనే స్కూబా డైవ్‌ సముద్రంలో డైవర్ చేస్తుండగా..సముద్ర తీరానికి 150 మీటర్ల దూరంలో, ఐదు మీటర్ల లోతులో ప్రాచీన కాలం నాటి మీటరు పొడవున్న కత్తితో పాటు లంగర్లు, కుండలు లభ్యమయ్యాయని తెలిపారు. ఇవి లభ్యమైనట్టు చెప్పారు. 4 వేల సంవత్సరాల క్రితం ఉత్తర ఇజ్రాయెల్ లోని ఈ ప్రాంతం ప్రాచీన నౌకలకు ఆశ్రయంగా ఉండేదని..పురావస్తు సంపదకు నిలయంగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు.