చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక 

చంద్రమండలంలో ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక  కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో ఇజ్రాయెల్ బేరెషీట్ అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితం తాకే లోపే కూలిపోయింది. ఈ మూన్ మిషన్ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : April 12, 2019 / 12:43 PM IST
చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక 

Updated On : April 12, 2019 / 12:43 PM IST

చంద్రమండలంలో ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక  కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో ఇజ్రాయెల్ బేరెషీట్ అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితం తాకే లోపే కూలిపోయింది. ఈ మూన్ మిషన్ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది.

చంద్రమండలంలో ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక  కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో ఇజ్రాయెల్ బేరెషీట్ అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితం తాకే లోపే కూలిపోయింది. ఈ మూన్ మిషన్ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఏడువారాల పాటు ప్రయాణం చేసిన నౌక.. 15కిలోమీటర్లు (9 మైళ్లు) దూరంలోని కక్షలోకి చేరుకుంది.. కొద్ది క్షణాల్లో చంద్రుని ఉపరితలాన్ని తాకబోతుందని అనుకునేలోపు స్పేస్ క్రాఫ్ట్ లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. ఒక్కసారిగా కమాండ్ సెంటర్ తో కమ్యూనికేషన్ కట్ అయి స్పేస్ క్రాఫ్ట్ కుప్పకూలిపోయినట్టు ఇజ్రాయెల్ ఏరోస్పెస్ ఇండస్ట్రీస్ స్పెస్ డివిజిన్ జనరల్ మేనేజర్ ఓపరల్ డోరన్ ప్రకటించారు. 
Read Also : ఇండోనేషియాలో భూకంపం, సునామీ వార్నింగ్

చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించనప్పటి నుంచి ఇజ్రాయెల్ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కంట్రోల్ రూం నుంచి వీక్షిస్తూనే ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రధాని బెంజిమిన్ కూడా.. ప్రయోగం విఫలం చెందడంపై పాజిటీవ్ గా రియాక్ట్ అయ్యారు. తొలి ప్రయోగం విజయవంతం కాలేదు.. మరోసారి ప్రయత్నిద్దాం అంటూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం విఫలం కావడంపై ప్రాజెక్ట్ ఆర్జినేటర్, మేజర్ బ్యాకర్ మోరీస్ కన్న్ మాట్లాడుతూ.. ప్రయోగాన్ని పూర్తిచేయలేకపోయాం. కానీ, శాయశక్తులా ప్రయత్నించామన్నారు.

తొలి ప్రయత్నంలో చంద్రుని ఉపరితలం వరకు చేరడం ఎంతో అద్భుతమని, గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకూ చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ లను నిలిపిన దేశాల్లో సోవియట్ యూనియన్, అమెరికా, చైనాకు చెందిన ప్రభుత్వ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ.. ఇజ్రాయెల్.. ఈ బేరెషీట్ అంతరిక్ష నౌకను ఊహించినట్టు విజయవంతంగా ప్రయోగించితే ప్రపంచంలో నాలుగో దేశంగా చర్రితలో నిలిచేది.      
Read Also : EVMలు బ్యాన్ చెయ్యాలి : చంద్రబాబు సంచలన డిమాండ్