మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 10:30 AM IST
మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం

Updated On : February 12, 2019 / 10:30 AM IST

హైదరాబాద్ : మనకు తెలియకుండానే మానవ మనుగడకు కీటకాలు ఎంతగానో తోడ్పడతాయి. కీటకాల వల్ల మనం పండించే పంటలకు ఎంతగా లాభం ఉంటుందో..మనిషి పంటల కోసం వినియోగించే రసాయినాల వల్ల కీటకాలకు అంతకంటే ప్రమాదం  ఏర్పడుతోంది. పరపరాగ సంపర్కానికి నిదర్శనంగా తెలిపే ఎన్నో కీటకాలలో రంగు రంగుల సీతాకోక చిలుకలు ప్రధానమైనవి. వీటిలో పలు జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఈ క్రమంలోనే మనిషి పంటల దిగుబడి పెంచేందుకు వినియోగిస్తున్న రసయినాల ధాటికి ఎన్నో క్రిమి కీటకాలు అంతిరించిపోతున్నాయనీ..అలా జరిగితే కీటకాల అంతరించిపోతే పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా అంతరించి పోయే పురుగులలో అందమైన ఆరుద్ర పురుగులు..రంగురంగు రెక్కల సీతాకోక చిలుకలు.. ఇంట్లో మూలమూలల్లో తిరుగుతూ రోత పుట్టించే బొద్దింకలు.. ఇవేవీ మరో వందేళ్ల తర్వాత కనిపించవని సిడ్నీ వర్సిటీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 

 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. కొన్ని జాతులైతే ఎప్పుడో అంతరించిపోయాయి. ఇంకా ఈ భూమ్మీద సంచరిస్తున్న క్షీరదాలు, పక్షులు, పాములు.. జాతులు అంతరించిపోయే స్పీడ్ తో లెక్కవేస్తే..పురుగు జాతుల నిర్మూలన ఎనిమిది రెట్లు ఎక్కువ వేగంతో అంతరించిపోతున్నాయనీ హెచ్చరిస్తున్నారు. వ్యవసాయానికి వాడుతున్న రసాయినాలే అందుకు కారణమని..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీటక జాతుల్లో 41 శాతం ఇప్పటికే వేగంగా అంతరిస్తున్నాయని..దీన్ని ఇలాగే వదిలేస్తే పురుగులు లేకపోవడం వల్ల పర్యావరణ వ్యవస్థ మొత్తం దెబ్బతిని మానవ మనుగడకూ ముప్పు కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.