అంతకోపమేంట్రా బాబూ..భార్యపై అలక..450 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయిన భర్త

Italy angry husband fanohusband walks 280 milesil : భార్యాభర్తలన్నాక..చిన్న చిన్న గొడవు మామూలే. ఉదయం గొడవపడితే సాయంత్రానికల్లా కలిసిపోతారు. కానీ ఓ భర్త మాత్రం భార్యతో గొడవపడిన 45ఏళ్ల వ్యక్తి ఏకంగా 280 మైళ్లు నడుచుకుంటూ వెళ్లిపోయిన ఆసక్తికర ఘనట వెలుగులోకి వచ్చింది. 280 మైళ్లు అంటే 450 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయాడు…!
ఏదో విషయంపై భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది.దీంతో ఆ భర్తకు భార్యపై ఎంత కోపం వచ్చిందంటే..ఏకంగా 280 మైళ్ల దూరం నడిచివెళ్లిపోయినా ఆ కోపం తగ్గనంత ఆగ్రహం. ఇది బహుశా ఎప్పుడూ విని ఉండడం..ఎవ్వరూ ఊహించి ఉండరు కూడా. అతను అలా నడుచుకుంటూ ఎందుకు వెళ్లిపోతున్నాడో పోలీసులు విధించిన కర్ఫ్యూ నిబంధల్ని ఉల్లంఘిటంతో అతడిని అరెస్ట్ చేయటంతో బైటపడింది..!!
ఒక భర్త తన భార్యపై ఏదో విషయమై గొడవపడ్డాడు. ఈ సమయంలో అతనికి ఎంత ఆగ్రహం కలిగిందంటే… దానిని చల్లార్చుకునేందుకు ఏకంగా 280 మైళ్ల దూరం నడుచుకుంటూపోయాడు. ఈ సమయంలో అతను ఇటలీలో విధించిన నైట్ కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో అరెస్టయ్యాడు. పోలీసులు అతనిని విచారించినపుడు ఈ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 48 ఏళ్ల ఆ వ్యక్తి వారం రోజులుగా నడుస్తున్నాడని తేలింది. భార్యతో గొడవపడ్డాక, కోపం రావడంతో, శాంతపరచుకునేందుకు ఇలా చేశాడని తెలిసింది.
వివరాల్లోకి వెళితే..సదరు భర్త స్విట్జర్లాండ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఇటలీలోని కోమో నగరంలో నివసిస్తున్నాడు. అతనికి భార్యమీద వచ్చిన కోపాన్ని తగ్గించుకోవటానికి మొదలు పెట్టిన నడకతో కోమోలో మొదలు పెట్టి ఫానో నగరానికి చేరుకున్నాడు.ఈ రెండింటి దూరం 426 కిలోమీటర్లు. అక్కడితో అతని నడక ఆగలేదు. అలా నడుచుకుంటూ ఫానో పట్టణం నుంచి మరో 30 కిలోమీటర్లు నడిచి అడ్రియాటిక్ తీరానికి చేరుకున్నాడు. అక్కడ కర్ఫ్యూ విధించటంతో నిబంధనల్ని ఉల్లంఘించి నడుచుకుంటూ వెళ్లిపోతున్న అతడిని తెల్లవారుఝామున 3 గంటల సమయంలో పోలీసులు పోలీసులు అతనిని పట్టుకున్నారు.
అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించగా..తాను ఇలా నడవడానికి గల కారణం గురించి చెప్పాడు. నా భార్యతో నేను గొడపడ్డాను. కానీ అతన్ని మాటల్ని పోలీసులు నమ్మలేదు. అతన్ని అలాగే అదుపులో ఉంచి అతను చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేయగా వారి విచారణలో అతని భార్య తన భర్త కనిపించకుండా పోయాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసింది. దీంతో సదరు వ్యక్తి చెప్పింది నిజమేనని పోలీసులు నమ్మారు.
ఈ సందర్భంగా ఆ భర్త మాట్లాడుతూ.. తనకు భార్యపై వచ్చిన కోపం తగ్గించుకోవటానికి ఇంట్లోంచి బైటకు వచ్చి నడస్తూ అలా వచ్చేశానని కానీ ఇంత దూరం నడిచాననే విషయం కూడా తను గమనించలేదని చెప్పాడు. తన మనసును శాంతింపజేసుకోవటానికి నడక మొదలు పెట్టానని కానీ ఇంతదూరం వచ్చాననే విషయమే గమనించలేదని చెప్పాడు. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాననీ..కానీ బాగా అలసిపోయానని పోలీసులకు చెప్పాడు.
తనతో గొడవపడిన భర్త కనిపించకుండాపోయేసరికి పాపం ఆ భార్య కంగారుపడిపోయింది. వెంటనే తెలిసినవారిని..స్నేహితుల్ని, బంధువుల్ని అడిగింది మీ ఇంటికి వచ్చాడనీ. కానీ వాళ్లు రాలేదని చెప్పగా..భయపడిపోయిన ఆమె వెంటనే పోలీసులకు తన భర్త కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది.
కానీ ఇలా తనను విడిచి అంత దూరం నడుచుకుంటూ వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆమె ఆదుర్గాగా భర్త కోసం ఫానో పట్టణానికి చేరుకుంది. సారీ చెప్పింది. ‘‘భార్యాభర్తలన్నాక గొడవలు వస్తుంటాయి. అంతదానికి ఇలా చేస్తారా?ఎంత కంగారుపెట్టేశావు..ఇడియట్’’ అంటూముద్దుగా విసుక్కుంది. దాంతో ఆ భర్త కోసం కరిగిపోయింది.
దీనికి అతను కూడా మాట్లాడుతూ..‘‘నీపై చాలా కోపం వచ్చింది..ఆ కోపంలో ఏం చేస్తున్నానో తెలీక ఇలా వచ్చేశానని..సారీ..’’అని చెప్పాడు. ఇద్దరూ కౌగలించుకుని ఇంటికి బయలుదేరారు. కాగా..సదరు భర్తకు కరోనా నైట్ కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించినందుకు పోలీసులు అతనికి 400 యూరోల జరిమానా విధించారు.