Kandahar Taliban : విమానాశ్రయంపై తాలిబన్లు దాడులు

దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. కొంతమంది తాలిబిన్ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు.

Kandahar Taliban : విమానాశ్రయంపై తాలిబన్లు దాడులు

Taliban

Updated On : August 1, 2021 / 11:48 AM IST

Kandahar Airport : తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అప్గానిస్తాన్ లో బీభత్సం సృష్టిస్తున్నారు. అప్గాన్ లోని మెజార్టీ ప్రాంతాలను వీరు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఆక్రమించుకొనే సమయంలో..భీకర పోరు కొనసాగిస్తున్నారు. వీరి జరుపుతున్న దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అప్గాన్ సైన్యం. దీంతో ఇరువర్గాల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. దేశ దక్షిణ ప్రాంతంలో కీలక ప్రాంతమైన కాందహార్ ఆక్రమణకు గత కొన్ని వారాలుగా తాలిబన్లు తీవ్ర ప్రయత్నాలు జరుపుతున్నారు. కొంతమంది తాలిబన్ మిలిటెంట్లు నగరంలోకి ప్రవేశించారు. విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు.

Read More : Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

రాకెట్లతో దాడులు జరపడంతో కలకలం రేపింది. రెండు రాకెట్లు రన్ వేను తాకాయని విమానాశ్రయ చీఫ్ మసూద్ పష్తూన్ వెల్లడించారు. రాకెట్ల దాడులు జరపడంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని వెల్లడించారు. రన్ వేను బాగుచేసే పనులు వేగంగా కొనసాగుతాయని, ఆదివారం మధ్యాహ్నానికి విమాన సేవలు పునరుద్ధరిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారాయన.

Read More : Tokyo Olympics : నిరాశపరిచిన బాక్సర్ సతీశ్ కుమార్

తాలిబన్లపై దాడి చేసేందుకు అప్గాన్ సైన్యం విమానాశ్రయాన్ని ప్రధానంగా ఎంచుకుంది. ఇక్కడి నుంచే లాజిస్టిక్, వాయుసేన సహకారం ఇక్కడి నుంచే కొనసాగుతోంది. దీంతో తాలిబన్లు విమానాశ్రయాన్ని టార్గెట్ చేసినట్లు సమాచారం. హెరాత్, లష్కర్ ఘాను సొంతం చేసుకొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అప్గాన్ మెజార్టీ ప్రాంతాలు..80 శాతం భూభాగం వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది.