రన్ వే లేకుండానే ల్యాండింగ్ : బోయింగ్ ‘ఫ్లయింగ్ కార్’ 

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 06:27 AM IST
రన్ వే లేకుండానే ల్యాండింగ్ : బోయింగ్ ‘ఫ్లయింగ్ కార్’ 

Updated On : January 24, 2019 / 6:27 AM IST

ఫ్లయింగ్ కార్ తయారీ 
30 అడుగుల పొడవు
రన్ వే లేకుండా ల్యాండింగ్ 
మనాసాస్ ఎయిర్ పోర్ట్ లో టెస్టింగ్ 

ఢిల్లీ : టెక్నాలజీ రోజు రోజు డెవలప్ అవుతోంది. మనిషి మేధస్సు ఇంకా ఏదో సాధించాలనే ఆరాటం కొనసాగుతునే వుంది. మైళ్ల దూరం నడుస్తు..పోయే మనిషి కేవలం అతి కొద్ది సమయంలోనే  వేలాది కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫ్లయింగ్ కార్ తొలిసారిగా ప్రయోగించి సక్సెస్ అయ్యింది. 

ప్రపంచంలోనే అత్యధిక విమానాలు తయారు చేసే బోయింగ్
ట్రాన్స్ పోర్ట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్న క్రమంలో సరికొత్త వాహనాన్ని ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా విమానాలను తయారు చేస్తున్న సంస్థగా పేరు తెచ్చుకున్న బోయింగ్..ఫ్లయింగ్ కార్ ప్రొటోటైప్ ను సిద్ధం చేసిన బోయింగ్..దాన్ని తొలిసారిగా ప్రయోగించి. ఈ వాహనంతో అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్, డెలివరీ సేవలు మరింత సులభమవుతాయని బోయింగ్ సంస్థ తెలిపింది. ఎయిర్ బస్ వంటి సంస్థలతో పోటీ పడుతూనే..మరోపక్కక ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ డెవలప్ చేసే బోయింగ్..ఇప్పుడు నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడంతో పాటు రోడ్డుపై కారులా, ఆపై గాల్లో విమానంలో ప్రయాణించే వాహనాన్ని తయారు చేసింది.

వెహికల్ స్పెషాలిటీ
30 అడుగుల పొడవు అంటే 9 మీటర్లు ఉండే ఈ వాహనం, హెలికాప్టర్, డ్రోన్, కారు, విమానాల మేళవింపు. నేలపై నుంచి నిట్టనిలువుగా గాల్లోకి ఎగురుతుంది. విమానంలా దూసుకెళ్లి, రన్ వే లేకుండానే సులువుగా ల్యాండ్ అవుతుంది. దీన్ని వర్జీనియాలోని మనాసాస్ విమానాశ్రయంలో తొలిసారిగా పరీక్షించామని, అది విజయవంతం అయిందని బోయింగ్ తెలిపింది.