కరోనా : ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది పూర్తిగా కోలుకున్నారు
కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.

కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. వైరస్ మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసులు నమోదుతూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, మంగళవారం (మార్చి 24, 2020) ఉదయం నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 101,911 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
అయినప్పటికీ, ధృవీకరించబడిన కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3 లక్షల 83 వేల 944 COVID-19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16,595 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్ లో 46 వేల 450 కేసులు నమోదు కాగా, 593 మరణించారు.
See Also | వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో అద్దె ఇళ్ల నుంచి గెంటివేత