మహిళల వ్యక్తిగత భద్రత కోసం కొత్త ఆయుధం

మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. మహిళల రక్షణ కోసం శ్యామ్‌ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త లిప్‌స్టిక్‌ గన్‌ను తయారు చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 07:16 AM IST
మహిళల వ్యక్తిగత భద్రత కోసం కొత్త ఆయుధం

Updated On : January 10, 2020 / 7:16 AM IST

మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. మహిళల రక్షణ కోసం శ్యామ్‌ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త లిప్‌స్టిక్‌ గన్‌ను తయారు చేశారు.

దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అనునిత్యం దేశంలో ఏదోఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. అకతాయిల వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది.

మహిళల రక్షణ కోసం శ్యామ్‌ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త లిప్‌స్టిక్‌ గన్‌ను తయారు చేశారు. ఎవరైనా మహిళ ప్రమాదకర స్థితిలో ఉన్నపుడు దీనికి అమర్చిన బటన్‌ను నొక్కాలి. అప్పుడు పేలుడు వంటి పెద్ద శబ్దం వెలువడటమే కాకుండా అత్యవసర ఫోన్‌ నంబర్‌ 112కు కూడా సమాచారం ఈ లిప్‌స్టిక్‌ గన్‌ పంపనున్నట్టు శ్యామ్‌ తెలిపారు. 

సాధారణ లిప్‌స్టిక్‌ మాదిరిగానే ఉండే దీనిని మహిళలు, యువతులు తమ వెంట ఉంచుకోవటం చాలా సులభమన్నారు. దీనిపై ఎవరికీ కూడా అనుమానం రాదని తెలిపారు. దీని ఖరీదు కేవలం ఆరు వందల రూపాయలేనని తెలిపారు.