‘లవ్‌మార్కెట్’ : భగ్న ప్రేమికుల కోసం

వియత్నాం : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న జంట అనివార్య కారణాలతో విడిపోతే..వారి ప్రేమను..ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేక..మనసు పడే వేదనకు భాష ఉంటుందా..దాన్ని చెప్పుకోవటానికి మాటలు సరిపోతాయా..అంటే లేవనే చెప్పాలి. ఇలా కంచికి చేరని ప్రేమ కథలు ఎన్నో..ఎన్నెన్నో. చాలా వరకూ ప్రేమ కథలు కథలుగానే మిగిలిపోతాయి. పెద్దల్ని ఒప్పించలేకో మరే కారణాలతోనే మరొకరిని పెళ్లి చేసుకునేవారు ఎంతోమంది ఉంటారు.
అనివార్య కారణాలతో మరొకరిని పెండ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్లు కూడా పెద్దవాళ్లయ్యాక..కొద్దిగా తీరుబడి దొరికినప్పుడల్లా గతించిపోయిన ప్రేమకథలు గుర్తుకొచ్చి గుండెల్ని మెలిపెడుతుంటాయి. ప్రేమించినవారిని తలచుకుని కంటి కొనలు దాటని కన్నీటి చుక్కలను అదిమిపెట్టి గుండెల్లో మెలిపెడుతున్న బాధను తలచుకుంటు కుమిలిపోయేవారి కోసం ఓ మార్కెట్ వెలసింది. అదే లవ్ మార్కెట్. గుండెల్ని తొలిప్రేమ జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చుతూనే ఉంటాయి. అలాంటివారు తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకుని ఓ రోజంతా గడిపేందుకు వియత్నాంలో ఏటా నిర్వహించేదే ‘లవ్‌మార్కెట్’. ఈ లవ్ మార్కెట్ కు ఓ కథ ఉంది.
ఎన్నో ఏళ్ల కిందట రెండు వేరువేరు తెగలకు చెందిన అబ్బాయీ అమ్మాయీ ప్రేమించుకున్నారట. వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యడం ఇష్టంలేక రెండు తెగల మధ్యా ఏర్పడిన శతృత్వానికి రక్తం ఏరులైపారిందట. దాంతో ఆ ప్రేమ జంట తమ పూర్వీకులు తమవల్ల అలా శతృవుల్లా మారిపోవటం ఇష్టం లేక..విడిపోవడానికి సిద్ధపడ్డారు. అలా విడిపోయిన ఆ ప్రేమజంట ప్రతీ ఏటా కవాయ్ అనే గ్రామంలో కలుసుకునేవారట. వారు అలా కలుసుకోవటం ఒక్క ఏడాది కూడా మరచిపోలేదట. అలా కొంతకాలానికి వారు చనిపోయారు. ఇది తెలిసిన కొందరు భగ్న ప్రేమికులు కవాయ్ ప్రాంతంలో కలుసుకుంటున్న క్రమంలో ఆ ప్రాంతం లవ మర్కెట్ గా మారిపోయిందట. ఇలా ఇలా కాలానుగుణంగా ఎంతోమంది భగ్నప్రేమికులు అక్కడికి వచ్చి కలుసుకోవడం మొదలుపెట్టారు.
100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని స్థానికులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వారి క్యాలెండర్ ప్రకారం ఏటా మూడవ నెల 26వ తేదీన జరిగే ఈ సంబరంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. ఎంతోమంది ఇక్కడికొచ్చి మాజీ ప్రేమికులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వారికి భాగస్వాములూ అడ్డుచెప్పరు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ మార్కెట్‌కి వచ్చి విడివిడిగా తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది.
Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు
Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు
Also Read: రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ