Gambia Childerns Death: గాంబియా చిన్నారుల మరణాలకు ఇండియన్ దగ్గు సిరప్‌లే కారణం.. మరోసారి స్పష్టం చేసిన యూఎస్ రిపోర్టు
డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు సిరప్‌లలో రెండు రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నందున.. గాంబియాలో 66 మంది పిల్లల మరణానికి ఇది కారణమైంది

Made-in-India cough syrups linked to child deaths in Gambia
Gambia Childerns Death: గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్‌లే కారణమని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ), గాంబియా ఆరోగ్య అధికారుల సంయుక్త పరిశోధనలు సూచించాయి. వాస్తవానికి డైథిలిన్ గ్లైకాల్‌తో కూడిన ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు భారతీయ ఔషధాలపై గతేడాదే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసింది. కాగా, చాలా మంది పిల్లల మరణానికి కారణమని తాజా పరిశోధన మరోసారి స్పష్టం చేసింది.
Arvind Kejriwal: నా కొడుకునైనా సరే జైలుకు పంపిస్తాను.. కర్ణాటక ప్రచారంలో కేజ్రీవాల్
శుక్రవారం సీడీసీ విడుదల చేసిన నివేదికలో “గాంబియాలోకి దిగుమతి చేసుకున్న డైథైలీన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్లతో కలుషితమైన మందులు పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ ఇంజూరీ క్లస్టర్‌కు దారితీశాయి’’ అని పేర్కొంది. ఇంకా నివేదికలో ‘‘డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు సిరప్‌లలో రెండు రసాయనాల పరిమాణం ఎక్కువగా ఉన్నందున.. గాంబియాలో 66 మంది పిల్లల మరణానికి ఇది కారణమైంది” అని పేర్కొన్నారు.
Mamata Alone Fight in 2024: కూటమి ప్రయత్నాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఓటములొచ్చినా ఒంటరి పోరేనట