ఈ ఏడాదిలో అతిపెద్దది : తైవాన్ లో భూకంపం

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 09:09 AM IST
ఈ ఏడాదిలో అతిపెద్దది : తైవాన్ లో భూకంపం

Updated On : April 18, 2019 / 9:09 AM IST

 తైవాన్ దేశంలో లో భూకంపం సంభవించింది. తూర్పు తైవాన్ లోని తీరప్రాంత నగరమైన హువాలియన్ లో గురువారం(ఏప్రిల్-18,2019)6.2తీవ్రతతో భూకంపం సంభవించింది.కొద్ది సేపు బిల్డింగ్ లు అన్నీ షేక్ అయ్యాయి.తైపీ నగరంలో సబ్ వే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ ఏడాది దేశంలో సంభవించిన భూకంపాల్లో ఇదే పెద్దదని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపారు.ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.ఈ  భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.