Malian Army : మాలి అధ్యక్షుడు,ప్రధానమంత్రి అరెస్ట్
మాలి అధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రిని అక్కడి సైనిక అధికారులు సోమవారం అరెస్టు చేశారు.

Malian Army Detains President Prime Ministerdefence Minister
Malian Army మాలి అధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రిని అక్కడి సైనిక అధికారులు సోమవారం అరెస్టు చేశారు. ప్రభుత్వ పునర్యవస్థీకరణ తర్వాత…అధ్యక్షుడు బాహ్‌డా, ప్రధాని మంత్రి మోక్టర్ ఓవాన్,రక్షణ మంత్రి సౌలేమనే డౌకోర్ ను అదుపులోకి తీసుకొని రాజధాని బమాకో వెలుపల కాటిలోని ఓ సైనిక స్థావరానికి తరలించారు.
కొద్ది నెలల క్రితం మాలిలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. 2020 ఆగస్టులో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా, ప్రధాన మంత్రి సిస్సేలను మిలటరీ గద్దె దించడంతో మాలిలో అస్థిరత నెలకొంది. మాలి తాత్కాలిక ప్రభుత్వం ఈ నెల మొదట్లో రాజీనామా చేసింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు బాహ్‌డా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాత్కాలిక ప్రధాని మోక్టర్ ఓవాన్ కు ఆదేశాలిచ్చారు.
మాజీ రక్షణ మంత్రి అయిన బాహ్‌డా తాత్కాలిక అధ్యక్షుడిగా, మాజీ విదేశాంగ మంత్రి మోక్టర్ ఓవాన్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తొమ్మిది నెలల క్రితం జరిగిన సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఇద్దరు సైనికులు..తాజాగా ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో తమ పదవులను కోల్పోయిన కొద్ది గంటల్లోపే సోమవారం మాలీలో అధ్యక్షుడు,ప్రధాని,రక్షణమంత్రి అరెస్టు జరిగినట్లు సమాచారం. కీలక నేతల అరెస్టుతో మాలిలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది.
ఇక, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మాలిలోని ఐక్యరాజ్య సమితి మిషన్ సూచించింది. సైన్యం అదుపులోకి తీసుకున్న నేతలను భేషరతుగా విడుదల చేయాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సూచించింది. సమస్యను పరిష్కరించేందుకు ఎకోవాస్(West African Regional Bloc) ప్రతినిధి బృందం మంగళవారం బమాకోను సందర్శించనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. బలవంతపు చర్యలను అంతర్జాతీయ సమాజం తిరస్కరిస్తుందని బృందం పేర్కొంది.