France : భార్యకు ప్రతి రాత్రి మత్తు మందు ఇచ్చి.. పదేళ్లుగా పర పురుషులతో అత్యాచారం, ఆపై వీడియో రికార్డు చేసిన భర్త
డొమినిక్ గుట్టు రట్టు అయింది. దుస్తులు మార్చుకునే గదుల్లో మహిళలను చిత్రీకరించేందుకు అతడు రహస్య కెమెరా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేయగా భార్యపై పర పురుషులతో అత్యాచారం చేయించిన వీడియో రికార్డింగులు బయట పడ్డాయి.

man drugged wife
Man Drugged Wife : ఫ్రాన్స్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యపైనే పర పురుషులతో అఘాయిత్యం చేయించాడు. భార్యకు ప్రతి రాత్రి మత్తు మందు ఇచ్చి పదేళ్లుగా పర పురుషులతో అత్యాచారం చేయించి ఆపై వీడియోను రికార్డు చేశాడు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. డొమినిక్ పీ అనే వ్యక్తికి 50 ఏళ్ల క్రితం ఓ మహిళతో వివాహం అయింది. వారికి ముగ్గురు సంతానం. ఈ నేపథ్యంలో 2011లో డ్రగ్స్ మత్తులో ఉన్న జీవిత భాగస్వాములతో అపరిచయ వ్యక్తుల శృంగారానికి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా కొందరు వ్యక్తులను డొమినిక్ సంప్రదించాడు.
రాత్రి వేళ భార్య భోజనంలో మత్తు మందు కలిపి ఆమెను మత్తులో ఉంచేవాడు. పర పురుషులను ఇంటికి రప్పించేవాడు. మత్తులో ఉన్న తన భార్యపై వారితో అత్యాచారం చేయించేవాడు. ఆపై ఈ చర్యను వీడియో రికార్డు చేసేవాడు. మరోవైపు భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా డొమినిక్ పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఘాటు వాసనలు నివారించేందుకు పొగ తాగడం, పెర్ ఫ్యూమ్స్ వాడటం నిషేధించాడు. పర పురుషులు తమ దస్తులు బాత్ రూమ్ లో వదిలి వేయకుండా కిచెన్ లోనే వాటిని విప్పాలని చెప్పేవాడు. అలాగే ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా ఉండేందుకు వాహనాలను సమీపంలోని స్కూల్ వద్ద పార్క్ చేయించేవాడు.
Titanic submarine:టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం..ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన
ఎవరూ చూడకుండా చీకటిలో నడిచి తన ఇంటికి రావాలని వారికి చెప్పేవాడు. 2011 నుంచి 2020 వరకు సుమారు పదేళ్లుగా దాదాపు వంద మంది పురుషులతో భార్యపై పలుమార్లు అత్యాచారం చేయించాడు. అయితే, 2020లో డొమినిక్ గుట్టు రట్టు అయింది. దుస్తులు మార్చుకునే గదుల్లో మహిళలను చిత్రీకరించేందుకు అతడు రహస్య కెమెరా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. దీనిపై దర్యాప్తు చేయగా భార్యపై పర పురుషులతో అత్యాచారం చేయించిన వీడియో రికార్డింగులు బయట పడ్డాయి.
పదేళ్లుగా సుమారు 92 మంది వ్యక్తులు మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 26 నుంచి 73 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 51 మందిని గుర్తించారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై లైంగిక దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఫైర్ మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు వంటి వారు నిందితుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
పలువురు వ్యక్తులు పలుమార్లు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించారు. మిగిలిన నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఇతర వ్యక్తులతో తనపై అత్యాచారాలు చేయిస్తూ.. ఆ చర్యలను భర్త వీడియో రికార్డ్ చేసిన విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న మహిళ షాక్ అయ్యారు. బోరున విలపించి డిప్రెషన్ కు గురయ్యారు. భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విడాకుల కోసం ఆమె దరఖాస్తు చేశారు.