Jumps from Plane: కదులుతోన్న విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు

కదులుతోన్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు అధికారులు.

Jumps from Plane: కదులుతోన్న విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు

Jumps From Flight (1)

Updated On : June 27, 2021 / 3:46 PM IST

Jumps from Plane: కదులుతోన్న విమానం నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు. లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు అధికారులు. సాల్ట్ లేక్ సిటీకు వెళ్లాల్సిన యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365ను స్కై వెస్ట్ నిర్వహిస్తోంది. సాయంత్రం7తర్వాత డోర్ తీసేందుకు ప్రయత్నించి విమానంలో నుంచి బయటకు దూకేశాడు.

ముందుగా పైలట్ లు ఉండే గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత సర్వీస్ డోర్ ఓపెన్ చేయాలనుకున్నాడు. చివరికి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి జారిపోయాడు. ఎయిర్ పోర్టు అధికారులు అతణ్ని కస్టడీలోకి తీసుకుని ట్యాక్సీ వేలో హాస్పిటల్ కు తీసుకుపోయారు.

ఈ ఘటనతో విమానం వెనక్కు తీసుకుని ఓ మూడు గంటల ఆలస్యంగా బయల్దేరింది. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ ఇన్వేస్టిగేట్ చేయనుంది. లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఘటన జరగడం రెండ్రోజుల్లోనే రెండోసారి.

గురువారం ఎయిర్‌ఫీల్డ్‌లోకి డ్రైవర్ దూసుకెళ్తుండగా పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు.