కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 05:21 AM IST
కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా

Updated On : March 4, 2020 / 5:21 AM IST

కరోనా భయం మాములుగా లేదు కదా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. వేల సంఖ్యలో మృతి చెందుతుండగా..చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దగ్గినా, తుమ్మినా ఇప్పుడే పెద్ద తప్పుగా భావిస్తున్నారు. తమకెదురుగా ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరిని నమ్మాలో..ఎవరిని నమ్మొద్దో అర్థం కావడం లేదు.(పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత కేసులు)

ఇలాంటి పరిస్థితి అన్ని దేశాల్లో నెలకొంది. తాజాగా తన భార్యకు వైరస్ సోకిందని అనుమానంతో ఆమెను బాత్‌రూంలో బంధించాడు. ఈ శాడిస్టు చేసిన నిర్వాకాన్ని పోలీసులకు తెలియచేసింది. ఈ ఘటన లిథుయానియాలో చోటు చేసుకుంది. ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో తన భార్య మాట్లాడిందని తెలుసుకున్నాడు. ప్రస్తుతం కరోనా వ్యాధి విజృంభిస్తుండడంతో అతనిలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భార్యకు కరోనా వైరస్ సోకిందని డాక్టర్‌కు చెప్పాడు. ముందుగా భార్యకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని చెప్పాడు. ఆమె ఎక్కడికి వెళ్లకుండా..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. 

See Also | టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం.. కారణం ఇదే

అంతే..ఆమెను బాత్ రూపంలో బంధించాడు. భర్త చేసిన ప్రవర్తనకు విసుగు చెందిన ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ కరోనా వైరస్ సోకలేదని వైద్యులు నిర్ధించారు. ఈ భర్త చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో తెలియడంతో వైరల్‌గా మారిపోయంది.