Facebook లో నా చావు లైవ్

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 06:49 AM IST
Facebook లో నా చావు లైవ్

Updated On : September 5, 2020 / 7:08 AM IST

Frenchman plans to livestream : అంతుచిక్కని రోగంతో బాధ పడుతున్నా..దీనికి మందు లేదు..అందుకే నన్ను చంపేయండి అంటున్నాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన అలేన్ కోక్క్ (57). కానీ చట్టాలు ఒప్పుకోవని ఫ్రాన్స్ దేశం చెబుతోంది. కానీ..అతను మాత్రం ఒప్పుకోవడం లేదు.
https://10tv.in/ludhiana-father-and-son-cycle-looks-like-a-scooter-did-amazing-scoo-bicycle-things-in-coronas-time-in-punjab/



నొప్పి కలుగకుండా మరణం ప్రసాదించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కు లేఖ రాశాడు. ఆ విజ్ఞప్తిని మెక్రాన్‌ తిరస్కరించారు. దీంతో అతను భోజనం, మంచినీళ్లు తాగడం మానేశాడు. వారం రోజులు మాత్రమే బతుకుతానని అంటున్నాడు.




కనీసం తన చావును Facebook లో Live Strem చేయాలని అనుకుంటున్నట్లు, ఇది..శనివారం ఉదయం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. చికిత్సకు నయం కాని జబ్బుతో బాధ పడుతున్న తనకు, ఇతరులకు చనిపోయేలా చూడాలంటున్నాడు. రైట్ టు డై కేసులు చాలాకాలంగా ఫ్రాన్స్ లో ఒక ఉద్వేగభరితమైన సమస్యగా మారింది.