భార్యపై అలిగి రోడ్డుపై నిలబడ్డాడు..తరువాత ఏమైంది

భార్య భర్తల మధ్య తగవులు షరామాములే. ఒకరిపై ఒకరు అలగడం..తిరిగి ఒకటి కావడం కామన్. ఒక్కోసారి ఈ అలకలు శృతిమించుతాయి. ఇలాగే చైనాలో చోటు చేసుకుంది. తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ భర్త టెస్టు చేసి ఆసుపత్రి పాలయ్యాడు.
చైనాలోని ఝెంజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం సేవించవద్దని..భార్య చెప్పేది. ఒక రోజు అలాగే మత్తులో ఇంటికి వచ్చాడు. కోపం వచ్చిన ఆ భార్య చివాట్లు పెట్టింది. తన మీద ప్రేమ ఉందో లేదో టెస్టు చేయాలని అనుకున్నాడు పాన్. ఇంటికి రాను అంటూ వెనక్కి వెళ్లి నడి రోడ్డు మీద నిలబడ్డాడు.
Read Also : రికార్డు సృష్టించిన తాత.. 86 ఏళ్ళ వయసులో సైక్లింగ్
అసలే రాత్రి. రయ్యి రయ్యిమంటూ వేగంగా వాహనాలు దూసుకెళుతున్నాయి. తన భర్తకు ఏమైనా ప్రమాదం జరగొచ్చని ఊహించిన భార్య..ఇంటికి రావాలని వేడుకుంది. నేను రాను..అంటూ అతను మొండికేశాడు. చెయ్యి పట్టుకుని అతడిని ఇంట్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. అయినా పాన్ వినిపించుకోలేదు. రోడ్డుకి అడ్డంగా నిల్చున్న అతడిని స్పీడుగా వచ్చిన ఓ వాహనం గుద్దేసింది. తీవ్రగాయాల పాలైన పాన్‌ని ఆసుపత్రికి తరలించింది. వైద్యులు అతడికి చికిత్స అందించారు. తన భార్య మాటలు వినిపించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా..అని పాన్ అనుకుంటున్నాడంట. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.