Elon Musk: చైనా క్రియేటివిటీ.. ఎలన్ మస్క్ డూప్లికేట్ చూశారా

ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండటబు ఎలన్ మస్క్ స్పెషల్ స్ట్రాటజీ. సోషల్ మీడియాలో, పబ్లిక్ అప్పీరియెన్స్ లో ఏదో ఒకలా కనిపించి ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ధనిక వ్యక్తి అయిన ఎలన్ మస్క్...

Elon Musk: చైనా క్రియేటివిటీ.. ఎలన్ మస్క్ డూప్లికేట్ చూశారా

Elon Musk

Updated On : December 27, 2021 / 1:53 PM IST

Elon Musk: ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండటబు ఎలన్ మస్క్ స్పెషల్ స్ట్రాటజీ. సోషల్ మీడియాలో, పబ్లిక్ అప్పీరియెన్స్ లో ఏదో ఒకలా కనిపించి ఆకట్టుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ధనిక వ్యక్తి అయిన ఎలన్ మస్క్ కు లైమ్ లైట్ లో ఉండటం చాలా ఈజీ. ఇదిలా ఉంటే డూప్లికేట్ వస్తువులు తయారుచేస్తుందనే పేరు తెచ్చుకున్న చైనాలో ఎలన్ మస్క్ డూప్లికేట్ కూడా దొరికేశాడు.

ఈ వీడియో వైరల్ అవుతుండటంతో స్వయంగా ఎలన్ మస్క్ దీనిపై ట్వీట్ చేశారు. టెస్లా సీఈఓను పోలి ఉన్న వ్యక్తి.. టిక్ టాక్ వీడియోలు చేస్తుండగా కనిపించాడు. సేమ్ మస్క్ కు మాదిరిగా నల్లని కోటు ధరించి బ్లాక్ కార్ పక్కనే నిల్చొని ఉన్న వీడియోను పోస్టు చేశాడు. సోషల్ మీడియా యూజర్లు బాగా దగ్గరగా పరిశీలించి ఇది మస్క్ కాదని కన్ఫామ్ చేసుకుంటున్నారు.

 

అదే రేంజ్ లో కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎలన్ మస్క్ డూప్లికేట్ వ్యక్తి పేరు కూడా యీ లాంగ్ మస్క్ అని పెట్టేసుకున్నాడు. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతూ.. ప్రతి వస్తువుకు చైనా వెర్షన్ ఒకటుంటుందని కామెంట్ చేశారు. ఎలన్ మస్క్ సైతం వైరల్ అవుతున్న అతని ఫొటోను రిట్వీట్ చేస్తూ.. ‘బహుశా నేను పాక్షికంగా చైనీస్ ని అయి ఉండొచ్చు’ అని కామెంట్ చేశారు.

rEAD aLSO : ప్రపంచంపై ఒమిక్రాన్ పంజా..ఆస్ట్రేలియాలో తొలి మరణం!