Baby Travel Influencer : ఏడాది బుడ్డోడు.. నెలకు రూ.75వేలు సంపాదిస్తున్నాడు!
ఈ బుడ్డోడి వయస్సు ఏడాదే.. కానీ, సంపాదించేది మాత్రం నెలకు రూ.35వేలు.. తన ఇన్ స్టాగ్రామ్ లో 30వేల మంది ఫాలోవర్లు ఉంటే.. టిక్ టాక్ అకౌంటుకు 2లక్షల 80వేల లైక్స్ ఉన్నాయి.

Baby Travel Influencer
baby travel influencer: ఈ బుడ్డోడి వయస్సు ఏడాదే.. కానీ, సంపాదించేది మాత్రం నెలకు రూ.35వేలు.. తన ఇన్ స్టాగ్రామ్ లో 30వేల మంది ఫాలోవర్లు ఉంటే.. టిక్ టాక్ అకౌంటుకు 2లక్షల 80వేల లైక్స్ ఉన్నాయి. అమెరికా మొత్తం చుట్టేసి బాగా పాపులర్ అయిపోయాడు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరంటే…? అక్టోబర్ 14, 2020 జన్మించాడు. ఈ చిన్నారి పేరు Briggs Darrington.. తన కుమారుడిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది తల్లి జెస్. తన బేబీతో అమెరికాను చుట్టేస్తోంది. ఈ సందర్భంగా తల్లి జెస్ మాట్లాడుతూ…. ‘కొన్ని ఏళ్లుగా పార్ట్ టైమ్ టూరిస్ట్స్ బ్లాగ్ రన్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించేందుకు డబ్బు కూడా పే చేస్తున్నాను. 2020లో ప్రెగ్నెంట్ కావడంతో తన కెరీర్ ఎండ్ అయిపోయిందని భావించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడు తాను చాలా భయపడ్డానని తెలిపింది.
Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..
View this post on Instagram
ఏడాది బేబీతో ఎలా పర్యటించాలో తెలియలేదు. కానీ, ధైర్యం చేసి ముందు అడుగు వేసినట్టు తెలిపింది. బేబీతో పాటు పర్యటన సాగించడం సాధ్యమేనా? అనిపించింది. బేబీతో ట్రావెల్ చేయడంపై ఏమైనా సమాచారం ఉందా? అని గూగుల్ లో కూడా సెర్చ్ చేసింది. కానీ, ఆమెకు ఎలాంటి సమాచారం దొరకపోవడంతో నిరాశకు లోనైంది. ఏదిఏమైనా చిన్నారితోనే తన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకుంది. అలా బేబీతో ట్రావెల్ చేస్తూ చిన్నారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వచ్చింది. క్రమంగా ఫాలోవర్లు పెరిగిపోయారు. లక్షలాది లైక్స్ వచ్చి పడ్డాయి.
View this post on Instagram
ఇంకేముంది స్పాన్సర్ షిప్ లభించింది. నెలకు సంపాదన కూడా పెరిగింది. బేబీతో ట్రావెలింగ్ చేయడానికి ముందు తన భర్త స్టీవ్ అనుమతి తీసుకుంది. అతడి సాయంతోనే తన పర్యటన పూర్తి చేయగలిగానంటూ చెప్పుకొచ్చింది తల్లి జెస్.. కరోనా లాక్ డౌన్ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాని, ప్రయాణ సమయాల్లో బేబీ పట్ల కేర్ తీసుకున్నట్టు తెలిపింది. న్యూయార్క్ వంటి బిగ్ సిటీల్లో తాను పర్యటించలేదని తెలిపింది. తన కుమారుడికి ట్రావెలింగ్ గురించి తెలియకపోవచ్చు. కానీ, విభిన్న ప్రాంతాల్లోని సంస్కృతులు, వ్యక్తులు, వాతావరణం వంటి బాగా అలవడుతాయని భావిస్తోంది. త్వరలో యూరప్ పర్యటనకు ప్లాన్ చేస్తోంది ఈ బుడ్డోడి ఫ్యామిలీ.
Virat Kohli : విరుష్క క్యూట్ ఫ్యామిలీ : భార్య, కుమార్తెతో కలిసి కోహ్లీ ఎంజాయ్!