Metro Train Collapsed : మెక్సికోలో కుప్పకూలిన మెట్రో ఫ్లైఓవర్‌..కింద పడ్డ రైలు 20 మంది మృతి

Metro Train Collapsed : మెక్సికోలో కుప్పకూలిన మెట్రో ఫ్లైఓవర్‌..కింద పడ్డ రైలు 20 మంది మృతి

Metro Train Collapsed

Updated On : May 4, 2021 / 1:19 PM IST

Metro Train Overpass Collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీనికి మెట్రో ఫ్లైఓవర్‌ కూలిపోవటంతో దానిమీది నుంచి రైలు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా ఫైఓవర్‌ కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

కాగా..మెట్రో ఫైఓవర్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు.దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాట్లుగా తెలుస్తోంది. సహాయక సిబ్బంది శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు చర్యల్ని ముమ్మరం చేశారు. మెక్సికో సిటీలో మెట్రో ప్రపంచంలోని అతిపెద్ద వేగవంతమైన రవాణా వ్యవస్థలలో ఒకటిగా పేరొందింది. ఈ రవాణా ద్వారా సంవత్సరానికి 1.6 బిలియన్ల ప్రయాణీకులకు ప్రయాణిస్తారు.

ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ.. మెట్రో రైల్‌ వెళుతుండగా బ్రిడ్జ్‌ కూలిపోవటంతో రాత్రి 10.30 సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారనీ తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సనందించాలని ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.