ఫొటో షూట్ కి వెళ్లి..పందితో కొరికించుకున్న మోడల్

పందులతో కలిసి ఫొటో దిగాలనకుకొన్న మోడల్ కి చేదు అనుభవం ఎదురైంది. బహమాస్ దేశంలో పిగ్ ఐలాండ్ లో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని పందులతో ఫొటో తీసుకొనేందుకు ప్రయత్నించి మోడల్ పందులతో కరిపించఉకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెన్ జులాకి చెందిన ఫిట్ నెస్ మోడల్ మిచెల్లి లెవిన్ ఫొటో షూట్ కోసం బహమాస్ లోని పిగ్ ఐలాండ్ కి వెళ్లింది. వైట్ బికినీలో మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఫొటో షూట్ లో పాల్గొన్న మిచెల్లి పక్కనే ఉన్న పందులతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఒక్కసారిగా పందుల గుంపు ఆమెను వెంబడించింది. గుంపులోని ఓ తల్లి పంది మిచెల్లిని కొరికి గాయపరిచింది. ఈ ఫన్నీ వీడియోను మిచెల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల సంఖ్యలో నెటిజన్లఉ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. పందుల ఐలాండ్ కి వెళ్లి పందులతో కరిపించుకొందంటూ నెటిజన్లు ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.