Mukesh Ambani: విలాసవంతమైన ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ, ధర ఎంతో తెలుసా..
దేశ విదేశాల్లో లగ్జరీ హౌస్ లు ఉన్న ముఖేశ్ అంబానీ ఓ లగ్జరీ హౌస్ ను అమ్మేశారు. ఈ అమ్మకంతో ఆ ఇంటి ధర, ఇంటి ప్రత్యేకత మరోసారి వైరల్ అవుతోంది. ఆ ఇంటి ప్రత్యేకతలే కాదు ఆ ఇంటి ధర విన్నా దటీజ్ అంబానీ అనిపిస్తోంది.
![Mukesh Ambani: విలాసవంతమైన ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ, ధర ఎంతో తెలుసా.. Mukesh Ambani: విలాసవంతమైన ఇంటిని అమ్మేసిన ముకేశ్ అంబానీ, ధర ఎంతో తెలుసా..](https://10tv.in/wp-content/uploads/2023/08/Mukesh-Ambani-House-sell.jpg)
Mukesh Ambani House sell
Mukesh Ambani House sell : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా లగ్జరీ హౌసులు ఉన్నాయి. వాటిలో ఓ విలాసవంతమైన విల్లాను అమ్మేశారు ముఖేశ్ అంబానీ. దీంతో మరోసారి ముఖేశ్ అంబానీ లగ్జీరీ గురించి .. ఆ విల్లా ధర గురించి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్ (New York) లోని మాన్హట్టన్ (Manhattan)లో అంబానీకి ఓ విలాసవంతమైన ఇల్లు (luxurious apartment) ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటిని ముఖేశ్ అంబానీ అమ్మేశారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. మాన్హట్టన్ వెస్ట్ విలేజ్లో గల ఓ అపార్ట్మెంట్లోని నాలుగో ఫ్లోర్ లో 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని అంబానీ 9 మిలియన్ డాలర్లకు విక్రయించారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. దీని ధర భారత కరెన్సీలో రూ.74.53 కోట్లు. అంబానీ అమ్మేసిన ఇంటిని సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరి (Superior Ink Factory)అని కూడా పిలిచేవారు.
విల్లా విశేషాలు..
హడ్సన్ నదీ తీరాన ఉన్న ఈ విల్లా 10 అడుగుల ఎత్తుల సీలింగ్స్, హెరింగ్బోన్ హార్డ్వుడ్ ఫ్లోర్స్ తో బయటనుంచి చిన్నపాటి సౌండ్ కూడా లోపలికి వినిపించకుండా ఉండేలా కిటీల నిర్మాణం ఉంటుంది. లేటెస్ట్ ఫెసిలిటిస్ తో ఉండే ఈ ఇంటినుంచి చూస్తే హడ్సన్ నదీ అందాలు కనిపించేలా ఉంటుంది. ఇక ఇంటీరియర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అత్యద్భుతంగా ఉంటుంది.
మూడు బెడ్ రూములు, మూడు స్మిమ్మింగ్ రూమ్స్, పిల్లలు ఆడుకునే ఓ ఆటగది, పిలేట్స్ రూమ్, యోగా రూమ్, విశాలమైన లాంజ్, వాలెట్ పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ ఇంటి సొంతం. 1919 నాటి ఈ విల్లా మార్క్ షటిల్ వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ వంటి ప్రముఖుల్ని నివాసితులుగా ఉన్న భవనం ఇది.