వేల కోట్ల విలువైన ఇళ్లు దగ్థం…పరుగులు తీసిన హాలీవుడ్ స్టార్స్

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2019 / 07:12 AM IST
వేల కోట్ల విలువైన ఇళ్లు దగ్థం…పరుగులు తీసిన హాలీవుడ్ స్టార్స్

Updated On : October 29, 2019 / 7:12 AM IST

అమెరికాలోని కాలిఫోర్నియా అడ‌వుల్లో మొద‌లైన కార్చిచ్చు క్ర‌మంగా లాస్ ఏంజిల్స్‌ను తాకింది. విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాలీవుడ్ స్టార్స్‌, సెల‌బ్రిటీలు ఉండే అత్యంత సంప‌న్న ప్రాంతం బ్రెంట్‌ వుడ్ స‌హా ప‌లు శివారు ప్రాంతాల్లో దావాగ్ని వ్యాపించింది. అర్ధ‌రాత్రి మంట‌లు ఎగిసిప‌డ‌టంతో సెల‌బ్రిటీలు భ‌యంతో ఇళ్ల నుండి ప‌రుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ఈ ప్ర‌మాదంలో మిలియ‌న్ డాల‌ర్ల విలువ చేసే ఐదు ఇళ్లు ద‌గ్ధ‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ కార్చిచ్చు కార‌ణంగా ఆర్నాల్డ్ కొత్త సినిమా `ట‌ర్మినేట‌ర్ డార్క్ ఫేట్‌` ప్రీమియ‌ర్ షోను ర‌ద్దు చేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చర్య‌ల‌ను చేప‌ట్టారు. మంట‌ల‌ను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలిఫోర్నియా గవర్నర్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.