Mumbai Attack Mastermind : ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ భుట్టవీ మృతి…ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరణ

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది.....

Mumbai Attack Mastermind : ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ భుట్టవీ మృతి…ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరణ

Hafiz Abdul Salam Bhuttavi

Updated On : January 12, 2024 / 5:46 AM IST

Mumbai Attack Mastermind : లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ పంజాబ్ ప్రావిన్సులో పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉన్నపుడు గత ఏడాది మే నెలలో గుండెపోటుతో మరణించాడని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. భుట్టవీ హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా పనిచేశారు.

ALSO READ : Covid sub-variant JN.1 : దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి

ముంబయి దాడుల్లో 166 మంది మరణించగా, మరో 300 మంది గాయపడ్డారు. హఫీజ్ ను అప్పగించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ముంబయి ఉగ్రదాడుల తర్వాత హఫీజ్ సయీద్‌ను నిర్బంధించిన కాలంలో భుట్టవీ గ్రూప్ రోజువారీ కార్యక్రమాల బాధ్యతలను తీసుకున్నారని సమాచారం. 2009వ సంవత్సరం జూన్ నెలలో హఫీజ్ సయీద్ పాకిస్థాన్ అధికారుల నిర్బంధం నుంచి విడుదలయ్యాడు.

ALSO READ : Covid sub-variant JN.1 : దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి

ప్రస్తుతం ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ దేశంలో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో లష్కరే తోయిబా సంస్థాగత స్థావరానికి భుట్టవీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.